వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలేష్ కు షాక్ :పార్టీ నుండి ఆరేళ్ళపాటు బహిష్కరించిన ములాయం

సమాజ్ వాదీ పార్టీ నాయకుల మద్య ఆదిపత్యపోరు సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోటాపోటీగా జాబితాలను ప్రకటించారు. అయితే అఖిలేష్ యాదవ్ కు ములాయం సింగ్ యాదవ్ షోకాజ్ నోటీసు పంపాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీలో కలకలం రేగింది.ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను పార్టీ నుండి ఆరేళ్ళపాటు సస్పెండ్ చేస్తూ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ నిర్ణయం తీసుకొన్నారు.

పార్టీ భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. ఇప్పటికే రెండు వర్గాలుగా చీలిపోయింది.పార్టీ ప్రకటించిన అధికారిక అభ్యర్థుల జాబితాలో తన మద్దతుదారులకు చోటుదక్కకపోవడంతో తన మద్దతుదారులతో మరో జాబితాను ప్రకటించారు అఖిలేష్ యాదవ్. ఈ జాబితా ప్రకటనను నిరసిస్తూ అఖిలేష్ యాదవ్ కు షోకాజ్ నోటీసును పంపారు.

అయితే ఈ నోటీసుకు సమాధానం రాకముందే పార్టీ నుండే ఆయనను ఆరేళ్ళపాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనం కల్గించింది.అఖిలేష్ యాదవ్ తో పాటు పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ పై కూడ పార్టీ ఆరేళ్ళపాటు బహిష్కరణ ఆస్త్రం విధించింది

అంతకుముందు ఏం జరిగిందంటే

ఉత్తర్ ప్రదేశ్ లోని అధికార సమాజ్ వాదీ పార్టీలో తండ్రి కొడుకుల మధ్య ఆదిపత్య పోరు తారాస్థాయికి చేరుకొంది. తాను సూచించిన అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించలేదనే నెపంతో అఖిలేష్ యాదవ్ స్వంతజాబితాను ప్రకటించడంతో పార్టీ చీప్ ములాయం సింగ్ యాదవ్ ఆగ్రహంతో ఉన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘించారనే కారణంతో ఆయనకు అఖిలేష్ కు ములాయం సింగ్ యాదవ్ షోకాజ్ నోటీసు పంపారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని అధికార సమాజ్ వాదీ పార్టీలో కొంత కాలంగా సమస్యలు నెలకొన్నాయి.పార్టీ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయారు. శివపాల్ యాదవ్, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వర్గాలుగా విడిపోయిన ఈ రెండు గ్రూపుల మద్య వివాదాలు సద్దుమణిగినట్టే కన్పించాయి. కాని అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో తిరిగి విబేధాలు ప్రారంభమయ్యాయి.

పార్టీలో మాఫియా డాన్లతో పాటు నేరచరిత్ర ఉన్నవారి రాకను ముఖ్యమంత్రి అఖిలేష్ వ్యతిరేకిస్తున్నాడు. కాని, శివపాల్ యాదవ్ మాత్రం ఆ రకమైన చరిత్ర ఉన్నవారిని పార్టీలోకి ఆహ్వనిస్తున్నాడు.అంతేకాదు తన తండ్రి ములాయంకు శివపాల్ చెప్పిందే వేదంగా మారడం కూడ అఖిలేష్ కు నచ్చడం లేదు.

కొంతకాలం క్రితం వరకు ఉన్న విబేదాలు సద్దుమణిగినట్టుగానే కన్పించాయి.అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేయడంతో ఈ విబేధాలు మరింత బయటపడ్డాయి.

 అఖిలేష్ కు నోటీసులు పంపిన ములాయం సింగ్

అఖిలేష్ కు నోటీసులు పంపిన ములాయం సింగ్

మూడురోజుల క్రితం బుందేల్ ఖండ్ లో ఎన్నికల ప్రచారం లో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉన్నారు. అదే సమయంలో తండ్రి ములాయంసింగ్ యాదవ్, బాబాయ్ శివపాల్ యాదవ్ లు కలిసి325 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో అఖిలేష్ యాదవ్ మద్దతుదారులకు మొండిచేయి మిగిలింది.దీంతో అఖిలేష్ యాదవ్ తన మద్దతుదారులతో సమావేశమై రెబెల్స్ గా బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు అఖిలేష్ యాదవ్ 235 అభ్యర్థుల పేర్లతో తన జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో తండ్రి ప్రకటించిన 187 మంది పేర్లు కూడ ఉన్నాయి. తాను అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే తనకు పోటీగా అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో ఆగ్రహం చెందిన ములాయంసింగ్ యాదవ్ ముఖ్యమంత్రి బాద్యతలు నిర్వహిస్తున్న తన తనయుడు అఖిలేష్ యాదవ్ కు షోకాజ్ నోటీసు జారీచేశాడు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఈ నోటీసులు పంపాడు.

 శివపాల్ యాదవ్ కే ములాయం మద్దతు

శివపాల్ యాదవ్ కే ములాయం మద్దతు

పార్టీలో అమర్ సింగ్ తిరిగి చేరడాన్ని అఖిలేష్ యాదవ్ వ్యతిరేకించాడు. ఆ నిర్ణయం నుండి పార్టీలో నిపురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు బయటపడుతున్నాయి.అమర్ సింగ్ ఉదంతంతో పార్టీలో నెలకొన్న సమస్యలు తాత్కాలికంగా సద్దుమణిగినట్టుగానే కన్పించాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి అభ్యర్థులను ప్రకటించాలని సమాజ్ వాదీ పార్టీ నిర్ణయం తీసుకొంది.అయితే అభ్యర్థుల ఎంపిక చేసింది.అయితే శివపాల్ యాదవ్ అభ్యర్థుల జాబితాను తయారు చేశారు. తొలుత ప్రకటించిన జాబితాలో అఖిలేష్ మద్దతుదారులకు మొండిచేయి చూపింది పార్టీ. అయితే శివపాల్ యాదవ్ కు అఖిలేష్ యాదవ్ 403 మంది అభ్యర్థుల జాబితాను పంపారు.అయితే ఈ జాబితాను శివపాల్ యాదవ్ పక్కన పెట్టారు.అయితే ఈ జాబితాకు బదులుగా అఖిలేష్ యాదవ్ వ్యతిరేక వర్గీయులకు పెద్దపీట వేశారు. పార్టీ ప్రకటించిన 325 పైగా స్థానాల్లో అఖిలేష్ మద్దతుదారులకు చోటు దక్కలేదు. జాబితాలో శివపాల్ యాదవ్ మద్దతుదారులకే చోటు దక్కింది.

 పినతండ్రి,అబ్బాయి మద్ద కుదరని సఖ్యత

పినతండ్రి,అబ్బాయి మద్ద కుదరని సఖ్యత

ఉత్తర్ ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్ష బాద్యతలను శివపాల్ యాదవ్ కు ములాయం సింగ్ కట్టబెట్టాడు.అయితే ఈ బాద్యతలే ఆయనకు కలిసివచ్చాయి.ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ ఉన్నప్పటికీ కూడ పార్టీ అభ్యర్థుల ప్రకటన విషయంలో శివపాల్ యాదవ్ దే పై చేయిగా మారింది. తన వ్యతిరేక వర్గీయులను శాసనసభలో అడుగుపెట్టకుండా చూడాలని అఖిలేష్ యాదవ్ చూస్తున్నారు.అయితే అఖిలేష్ యాదవ్ వ్యతిరేకులకు శివసాల్ అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడ ఇబ్బందికరంగా మారింది.

 పార్టీపై ప్రభావం చూపనున్న విబేదాలు

పార్టీపై ప్రభావం చూపనున్న విబేదాలు

సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సమస్యలు పార్టీ విజయావకాశాలపై పడే అవకాశం ఉంది.అయితే శివపాల్ యాదవ్ తో ములాయం సింగ్ రాజీ సూత్రాన్ని ప్రతిపాదించారు. అఖిలేష్ మద్దతుదారులైన 68 మందికి టిక్కెట్ల కేటాయింపు విషయమై చర్చించారు.అయితే ఈ విషయంలో రెండు వర్గాల మద్య అంగీకారం కుదరలేదు. దరిమిలా అఖిలేష్ యాదవ్ తన జాబితాను విడుదల చేశారు. తండ్రి తనయుల మద్య ఆధిపత్య పోరు కొంత కాలంగా సాగుతోంది.అయితే పోరుఇదే రకంగా ఉంటే ఆ పార్టీపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
samaj wadi party chief mulayam singh yadav has issued a show cause notice to cm akhikesh yadav for indispline over releasing parallel list of candidates of uttar pradesh assembly elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X