వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ములాయంకు స్వైన్ ఫ్లూ లక్షణాలు... నిర్ధారించలేమని వైద్యులు...?
గుర్గావ్: సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆసుపత్రి పాలయ్యారు. ఆయనకు స్వైన్ ఫ్లూ సోకినట్లు అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి శ్వాస సంబంధమైన సమస్యతో అస్వస్థతకు గురికావడంతో ఆయన గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు.
ఆయనకు ఊపిరి సరిగా అందడం లేదని వైద్యులు చెబుతున్నారు. ములాయం శాంపిళ్లను పరీక్షల కోసం పంపించామని, ఆయనకు స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నట్లు కనిపించినా.. ఇప్పుడే నిర్ధారించలేమని ఆస్పత్రికి చెందిన సీనియర్ వైద్యుడొకరు శనివారం తెలిపారు.

ములాయంను కేవలం మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు చెప్పారని, ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సినదేమీలేదని వైద్యులు సూచించారని సమాజ్‌వాది పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్రచౌదరి చెప్పారు. ములాయంకు డాక్టర్ నరేష్ ట్రెహాన్ నేతృత్వంలోని వైద్య బృందం పరీక్షలు చేస్తున్నారు.