వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాంగోపాల్ యాదవ్ పై ఆరేళ్ళపాటు బహిష్కరణ అస్త్రం సంధించిన ములాయం సింగ్

సమాజ్ వాదీ పార్టీ నుండి ఆరేళ్ళపాటు రాంగోపాల్ యాదవ్ ను బహిష్కరిస్తూ ములాయం సింగ్ యాదవ్ నిర్ణయం తీసుకొన్నాడు. పార్టీ జాతీయ కార్యవర్గ నిర్వహణకు రాంగోపాల్ యాదవ్ కీలకభూమిక పోషించాడనే ఆరోపణలతో ములాయం ఈ నిర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకొంటుంది.పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహణకు కారణంగా రామ్ గోపాల్ యాదవ్ ను ఆరేళ్ళపాటు పార్టీ నుండి బహిష్కరిస్తూ ములాయం సింగ్ నిర్ణయం తీసుకొన్నాడు. ఈ మేరకు ఆయనను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో ఆదివారం ఉదయం సమాజ్ వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించి, ఈ సమావేశంలో అఖిలేష్ యాదవ్ ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు. మెజార్టీ నాయకులు ములాయం ను వీడి అఖిలేష్ వైపుకు వచ్చారు.

సమాజ్ వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశ నిర్వహణకు కీలకభూమిక పోషించిన తన సోదరుడు రామ్ గోపాల్ యాదవ్ పై సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ బహిష్కరణ అస్త్రం సంధించారు. ఆరేళ్ళపాటు ఆయనను పార్టీ నుండి బహిష్కరించాడు.

mulayam singh suspends ramgopal yadav for six years , again

శుక్రవారం సాయంత్రమే అఖిలేష్ తో పాటు రామ్ గోపాల్ యాదవ్ పై ములాయం ఆరేళ్ళపాటు బహిష్కరణ అస్త్రం సంధించాడు.అయితే ఇద్దరి మద్య రాజీ కుదరడంతో బహిష్కరణ అస్త్రాన్ని విరమించుకొన్నాడు. అయితే ములాయం ను కాదని పార్టీ ని తన గుప్పిట్లో పెట్టుకొన్న అఖిలేష్ పై ములాయం గుర్రుగా ఉన్నారు. దరిమిలా ఈ సమావేశానికి హజరైన వారిపై చ ర్యలు తీసుకొంటామని ములాయం హెచ్చరించారు.

తొలుత రామ్ గోపాల్ యాదవ్ పై ములాయం సింగ్ యాదవ్ బహిష్కరణ అస్త్రం సంధించాడు.పార్టీ రాజ్యాంగానికి విరుద్దంగా ఈ సమావేశం జరిగిందని ములాయం ఆరోపించాడు. ఈ సమావేశానికి హాజరైన పార్టీ నాయకులపై చర్యలు తీసుకొంటామని ములాయం హెచ్చరించారు. హెచ్చరించినట్టుగానే తొలివేటు రాంగోపాల్ యాదవ్ పై వేశాడు.

English summary
mulayam singh yadav has suspended ramgopal from the party for six years again and has called national executive summit of the party on sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X