వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ములాయంసింగ్ యాదవ్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

|
Google Oneindia TeluguNews

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయంసింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పి రావడంతో ఆయనను కుటుంబసభ్యులు లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్‌కు తరలించారు. సాధారణంగా చెకప్ కోసం ములాయం ఆస్పత్రికి వచ్చారని వైద్యులు తెలిపారు.

ములాయంసింగ్ యాదవ్ వైద్య పరీక్షలను సంజయ్ గాంధీ ఆస్పత్రిలోనే చేయించుకుంటారు. బుధవారం కడపులో నొప్పి, నలతగా అనిపించడంతో కుటుంబసభ్యులు తరలించారు. అతనికి వైద్య బృందం పరీక్షలు నిర్వహిస్తోంది. కడుపునొప్పి సాధారణంగా వచ్చేదేనా ? లేక ఇతర సమస్యల వల్ల వస్తోందా అనే అంశాలపై వైద్యులు పరీక్షలు చేయిస్తున్నారు.

Mulayam Singh Yadav admit in hospital

ములాయంసింగ్ యాదవ్.. సమాజ్‌వాదీ పార్టీని స్థాపించి ఉత్తర్‌ప్రదేశ్‌లోకి అధికారంలోకి తీసుకొచ్చారు. యూపీ సీఎంగా, కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. అయితే కొద్దిరోజుల క్రితం ఇంట్లో నెలకొన్న గొడవలతో పార్టీ కుమారుడు అఖిలేశ్ యాదవ్ చేతుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి తండ్రి, కొడుకులు మధ్య సఖ్యత లేదు. తన సోదరుడు శివపాల్ యాదవ్‌ను అఖిలేశ్ పక్కనపెట్టడంతో ములాయం ప్రతిస్పందించారు. అఖిలేశ్‌ను తప్పుపట్టారు. కానీ చివరకు ఎస్పీ అఖిలేశ్ చేతిలో ఉండగా.. ములాయం పార్టీకి దూరంగానే ఉంటున్నారు.

English summary
samajwadi Party supremo Mulayam Singh Yadav was admitted to the hospital after he complained of stomach ache.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X