వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముంబైలో కూలిన ఐదంతస్తుల భవనం, 19 మంది మృతి: 971 బిల్డింగ్‌లకు ప్రమాదం
ముంబై: భారీ వర్షాల కారణంగా ముంబైలో ఓ ఐదంతస్తుల భవనం కూలింది. జెజే నగర్ సమీపంలోని పక్‌మెడియా వీధిలో గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది. 19 మంది మృతి చెందారని తెలుస్తోంది.
శిథిలాల కింద దాదాపు ముప్పై మంది వరకు ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే ఎన్డీఆర్ఎఫ్ బృందం, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం సంఘటన స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి.
వరదలకు ముంబై అతలాకుతలం: కారణాలు ఏమిటంటే?

శిథిలాల కిందఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదని డిసిపి మనోజ్ శర్మ తెలిపారు.
వర్షాకాలం నేపథ్యంలో నగరంలో 971 భవనాలు ఏ క్షణంలో అయినా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు బిఎంసి (బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్) గుర్తించింది.