వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్: క్షేత్రస్థాయిలోకి పంపవద్దని వినతి

|
Google Oneindia TeluguNews

ముంబై: దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ 4200కుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం మహారాష్ట్రలో 552 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క ముంబై నగరంలోనే 456 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

కాగా, ముంబై నగరంలో భారీ సంఖ్యలో జర్నలిస్టులు కూడా కరోనా బారినపడ్డారు.
మొత్తం 170 మంది రిపోర్టర్లు, వీడియో జర్నలిస్టులు, డ్రైవర్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా, 53 మందికి పాజిటివ్ అని తేలినట్లు సమాచారం. అయితే, వీరిలో ఎవరిలోనూ కరోనా లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం.

Mumbai: 53 Journalists Test Positive For Coronavirus

ఇది ఇలావుండగా, తమిళనాడు రాజధాని చెన్నైలోనూ ముగ్గురు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మరికొంత మంది జర్నలిస్టులకు పరీక్షలు నిర్వహించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ జర్నలిస్టుకు కూడా కరోనా సోకింది. అంతకుముందు ఆయన కమల్‌నాథ్ సమావేశంలో ఆయన పాల్గొనడంతో కలకలం రేగింది. జర్నలిస్టులు కరోనా బారిన పడుతుండటంతో మీడియా సంస్థల యాజమాన్యాలు ముంబైలో రిపోర్టర్లను క్షేత్రస్థాయి రిపోర్టింగ్‌కు పంపవద్దని ఎడిటర్స్ గిల్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ శేఖర్ గుప్తా, న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్‌ను పలువురు జర్నలిస్టులు కోరారు.

దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 17,656కు చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1540 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 559కు చేరినట్లు తెలిపింది. 2841 మంది కోలుకున్నారు.

Recommended Video

Fake News Buster EP 10 : సోడియం హైపోక్లోరైట్ మనుషులు వాడచ్చా ?

English summary
At least 53 journalists in Mumbai have tested positive for COVID-19 and the number is likely to go up, officials said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X