వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుల్లెట్ ట్రైన్ టిక్కెట్ ధరెంత? ఏయే స్టేషన్లలో ఆగుతుందో తెలుసా?

దేశంలో వచ్చే 2022 ఆగస్టు 15వ తేదీ నుంచి బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత అహ్మదాబాద్ - ముంబైల మధ్య తొలి బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

India’s first bullet train : All you need to know

న్యూఢిల్లీ: దేశంలో వచ్చే 2022 ఆగస్టు 15వ తేదీ నుంచి బుల్లెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత అహ్మదాబాద్ - ముంబైల మధ్య తొలి బుల్లెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ ప్రాజెక్టు కోసం గురువారం భూమి పూజ జరిగింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షింజో అబేలు పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి రైల్వే స్టేషన్ - ముంబైలోని బాంద్రా కుర్లా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రాజెక్టును చేపడతారు.

bullet-train

మొత్తం 508 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రైలు మార్గాన్ని 27 కిలోమీటర్ల సొరంగ మార్గంలోనూ, 12 కిలోమీటర్లు వంతెనలపైనా, మరో 468 కిలోమీటర్లు భూమిపై నిర్మించనున్నారు. ఈ మార్గంలో బుల్లెట్ ట్రైన్ నాలుగు రైల్వే స్టేషన్లలో ఆగి వెళితే ప్రయాణ సమయం 2 గంటల 7 నిమిషాల సమయం పడుతుంది.

అయితే మొత్తం 12 స్టేషన్లలో ఆగి వెళ్లేలా ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇందులో బాంద్రా కుర్లా, థానే, విరార్, బోయిసర్, వప్లే, బిల్‌మోరా, సూరత్, బహ్రుచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి స్టేషనలో ఆగి వెళ్లేలా ప్రతిపాదిస్తున్నారు. ఇలా 12 స్టేషన్లలో ఆగి వెళితే మాత్రం ప్రయాణ సమయం 2 గంటల 58 నిమిషాల సమయం పడుతుంది.

బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణ టిక్కెట్ ధర ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా... రూ.2700 నుంచి రూ.3000లోపు ఉండనుంది. కానీ, ఈ మార్గంలో విమాన టిక్కెట్ ధర రూ.3500 నుంచి రూ.4000 వరకు ఉండగా, లగ్జరీ బస్సులో రూ.1500 నుంచి రూ.2000 వరకు ఉంది.

English summary
The high-speed rail was envisioned by PM Modi to take Indian Railways towards most modern technologies like the developed countries. With Indian Railways adopting such technologies, the bullet train was an endeavour to bring economic growth and prosperity in the country. The 508-km Mumbai-Ahmedabad High-Speed Rail Project will entail an estimated cost of Rs. 1,10,000 crore. The fare of a first class ticket between Mumbai to Ahmedabad ranges between Rs 1,800 to Rs 3,000. Thus, the fare structure of the bullet train is expected to range anywhere between Rs 3,000 and Rs 5,000, depending on their speed. On the Ahmedabad-Mumbai route, total 12 stations have been proposed that include Mumbai, Thane, Virar, Boisar, Vapi, Bilimora, Surat, Bharuch, Vadodara, Anand, Ahmedabad and Sabarmati. And, if the bullet train will stop at all 12 stations, then it will cover the distance in two hours and fifty-eight minutes. A total of 24 high-speed trains will be imported from Japan and then rest of the rakes will be manufactured in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X