• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముంబై పేలుళ్ళ కేసు: అబూ సలేంకు ఉరిశిక్ష ఎందుకు వేయలేదంటే?

By Narsimha
|

ముంబై:1993 ముంబై పేలుళ్ళ కేసు సుదీర్ఘంగా విచారణ సాగింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు నిరసనగా ముంబై పేలుళ్ళు చోటుచేసుకొన్నాయి. ఈ కుట్రకు పాల్పడిన అబూసలేం సహ నిందితులకు ముంబై టాడా కోర్టు గురువారం నాడు శిక్ష విధించింది.

ముంబై పేలుళ్ళ దోషులకు శిక్ష ఖరారు: ఇద్దరికి ఉరిశిక్ష

1993 మార్చి 12న ముంబయిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. రెండు గంటల వ్యవధిలో ఉగ్రవాదులు వరుసగా 12 చోట్ల బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 257 మంది ప్రాణాలు కోల్పోగా.. 713 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ కేసులోనే హిందీ సినీ నటుడు సంజయ్‌దత్‌ను పోలీసులు ఏప్రిల్ 19, 1993లో అరెస్ట్ చేశారు. సంజయ్‌దత్‌కు అబూసలేం ఆయుధాలను సమకూర్చారని ఆరోపణలున్నాయి.

1993 నవంబర్‌ 4న, సంజయ్‌ సహా 189 మందిని నిందితులుగా పేర్కొంటూ 10 వేలకుపైగా పేజీల అభియోగపత్రం దాఖలైంది.1993నవంబర్‌ 19న, మహరాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది.

తొలి దశ విచారణ మొదలిలా

తొలి దశ విచారణ మొదలిలా

1995 ఏప్రిల్‌ 10న, టాడా కోర్టు 26 మంది నిందితులను విడుదల చేసింది. మిగతా నిందితులపై అభియోగాలు నమోదు చేసింది. సుప్రీం కోర్టు మరో ఇద్దరు నిందితులను విడుదల చేసింది. ఏప్రిల్‌ 19న, తొలి దశ విచారణ మొదలైంది. జూన్‌ 30న,నిందితులు మహమ్మద్‌ జమీల్‌, ఉస్మాన్‌ ఝంకానన్‌ అప్రూవర్లుగా మారారు.దీంతో కేసుకు సంబంధించిన కీలక సమాచారం పోలీసులకు చేరింది. అదే ఏడాది అక్టోబరు 14న, సంజయ్‌దత్‌కు సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

 అబూసలేం దొరికాడిలా

అబూసలేం దొరికాడిలా

2000, అక్టోబర్‌లో తొలి దశ విచారణలో 684 సాక్షుల విచారణ పూర్తైంది. 2001, మార్చి 9 - జులై 18న,నిందితుల నుండి తమ వాంగ్మూలాలను ఇచ్చారు. 2002, సెప్టెంబర్‌ 18న, పోర్చుగల్‌లోని లిస్బన్‌లో అబూ సలేం దొరికిపోయాడు.2005 నవంబర్‌ 11న, అబూ సలేంను భారత్‌కు తీసుకువచ్చారు. అదే ఏడాది డిసెంబర్‌ 9న,అబూ సలేంపై అభియోగాలు నమోదయ్యాయి.

అబూసలేంపై విచారణ

అబూసలేంపై విచారణ

2006 జూన్‌ 13న, ఈ కేసుకు సంబంధించి అబూ సలేం విచారణను విడిగా మొదలుపెట్టారు. 2013 జూన్‌ 28న, నవీ ముంబయిలోని తలోజా సెంట్రల్‌ జైలులో దేవేంద్ర జగ్‌తాప్‌ అనే మాఫియా నాయకుడు సలేంపై కాల్పులు జరిపాడు.దీంతో ఆగస్టు 13: టాడా కోర్టు సలేంపై ఉన్న కొన్ని అభియోగాలను తొలగించింది. 2017 మార్చిలో కేసు విచారణ ముగిసింది. తీర్పును కోర్టు రిజర్వులో పెట్టింది.

అబూసలేంకు ఉరిశిక్ష ఎందుకు విధించలేదంటే

అబూసలేంకు ఉరిశిక్ష ఎందుకు విధించలేదంటే

ముంబై పేలుళ్ళ కేసులో అబూ సలేంకు మరణశిక్ష విధించాల్సి వున్నా, కొన్ని అనివార్య కారణాలతో న్యాయమూర్తులు ఆ పని చేయలేకపోయారు. అత్యంత తీవ్రమైన నేరం చేసినప్పటికీ, గరిష్ఠ శిక్ష వేయలేకపోయినట్టు న్యాయమూర్తులు చెప్పారు. ముంబై పేలుళ్ల అనంతరం అబూసలేం పోర్చుగల్ పారిపోయి అక్కడే ఉన్నాడు. ఆపై నటి మోనికా బేడీతో సహజీవనం చేశాడు. వీరిద్దరినీ మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ చేసిన అనంతరం, పోర్చుగల్ తో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు భారత అధికారులు వారిద్దరినీ ఇండియాకు తీసుకువచ్చారు. పోర్చుగల్ లో ఎటువంటి శిక్షకైనా మరణదండన లేదు. పైగా, అబూసలేంను అప్పగించే వేళ, అతనికి మరణదండన విధించబోమని భారత్ హామీ ఇచ్చింది. ఈ కారణంతోనే అతనికి యావజ్జీవ శిక్షతోనే సరిపెట్టాల్సి వచ్చిందని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Abu Salem escaped from death penalty in mumbai blasts.TADA court said thatWe had to give an assurance to Portugal that he will not be given death sentence. Without this assurance, he could not have been extradited. Once life imprisonment is given in Portugal, he cannot be kept imprisoned beyond 25 years. He has been convicted of 123 of IPC added with 302, and Section 32 of TADA. The maximum sentence is death sentence but this man cannot be awarded death sentence. This is because of the amendment in law in 1993. He is brought from a country where there is no death sentence
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more