వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ ఇండియా ప్లేన్‌కు తప్పిన ప్రమాదం: అత్యవసర ల్యాండింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఓ ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తడంతో ముంబైకి చెందిన ఎయిర్ ఇండియా విమానాన్ని అత్యవసరంగా దించారు. ఇంజన్లో తీవ్ర సమస్య తలెత్తిన విషయాన్ని పైలట్ గుర్తించాడు.

ఈ విషయాన్ని అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ముందస్తుగా విమానాన్ని వెనక్కి రప్పించడంతో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 777-300 అమెరికాలోని నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది.

Mumbai-bound AI flight from Newark makes emergency landing

29వేల అడుగుల ఎత్తులో విమానం ఉండగా విమానం కంపించింది. అప్రమత్తమైన పైలట్ సంబంధిత అధికారులతో మాట్లాడాడు. దీంతో ఆ విమానాన్ని నెవార్క్ లిబర్డీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో వెంటనే దించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ప్రయాణీకులను మరో విమానంలో ఢిల్లీకి తరలించారు. విమానానికి తనిఖీలు నిర్వహించారు. విమానాన్ని సురక్షితంగా దించేందుకు పైలట్ అరవై టన్నుల ఫ్యూయల్ డంప్ చేసుకున్నట్లుగా అధికారులు చెప్పారు. ప్రయాణీకుల్ని మరో విమానంలో ఢిల్లీకి తరలించినట్లు ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు.

English summary
A Mumbai-bound Air India flight from Newark Liberty International Airport with over 250 persons on board was forced to return and make an emergency landing today due to a serious engine problem, sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X