వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ బోట్‌లో డ్రగ్స్.. 600 కోట్ల రూపాయల హెరాయిన్ సీజ్

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్ : గుజరాత్‌ తీరంలో 600 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. పాకిస్తాన్‌కు చెందిన ఫిషింగ్ బోట్‌లో తరలిస్తున్న 200 కిలోల హెరాయిన్‌ను భారత కోస్ట్ గార్డ్ దళం సీజ్ చేసింది. డీఆర్ఐ (Directorate Of Revenue) అధికారులు, కోస్ట్ గార్డ్ సంయుక్త ఆపరేషన్‌లో ముఠా గుట్టురట్టైంది.

పాకిస్తాన్‌కు చెందిన బోట్‌లో భారీ ఎత్తున డ్రగ్స్ తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులకు పక్కా సమాచారం అందింది. దాంతో కోస్ట్ గార్డ్ సిబ్బందిని అప్రమత్తం చేసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. అందులోభాగంగా ఆరుగురు వ్యక్తులు వచ్చిన ఫిషింగ్ బోట్‌ను తనిఖీ చేయడంతో డ్రగ్స్ విషయం బయటపడింది.

సెల్లు పోయిందంటూ సొల్లు.. చర్చి ఫాదర్‌కు శఠగోపం.. మొబైల్, బైక్‌తో జంప్..!సెల్లు పోయిందంటూ సొల్లు.. చర్చి ఫాదర్‌కు శఠగోపం.. మొబైల్, బైక్‌తో జంప్..!

Mumbai Coast Guard seizes Pakistani boat carrying heroin worth 600 crore rupees

పట్టుబడ్డ ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు కోస్ట్‌ గార్డ్‌ ప్రతినిధి తెలిపారు. కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాథమిక విచారణలో డ్రగ్ టెస్టింగ్ కిట్‌తో పాటు 195 ప్యాకెట్లలో నింపిన 200 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గడిచిన రెండు నెలల్లో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరకడం ఇది రెండవసారి. యాంటీ నారోటిక్స్ ఆపరేషన్‌లో భాగంగా ఇదివరకు కూడా పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి.

English summary
The Indian Coast Guard In Gujarat Coastal Area chased and seized on Tuesday a Pakistani fishing vessel carrying 200 kg heroin, value about 600 crore rupees to be delivered to an Indian recipient.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X