వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలు పట్టాలపై కూర్చున్న సీఏఏ నిరసనకారులతో గొడవకు దిగిన ముంబై ఉద్యోగస్తులు

|
Google Oneindia TeluguNews

ముంబై: "మాకు ఆలస్యం అవుతోంది మర్యాదగా రైల్వే ట్రాక్‌పై నుంచి లేస్తారా లేదా" అంటూ పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న వారితో ముంబై ఉద్యోగులు వాగ్వాదంకు దిగారు. బుధవారం రోజున ముంబైలో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఈ సందర్భంగా పట్టాలపై కూర్చుని నిరసనలు తెలిపారు. ఆఫీసులకు వెళ్లే వారు లోకల్ ట్రైన్ ఎక్కేందుకు ప్లాట్‌ఫాం వద్దకు చేరుకున్నారు. రైలు ఎంతసేపటికి కదలకపోవడంతో అసలు కారణం తెలుసుకున్న ప్రయాణికులు ట్రాక్‌పై కూర్చున్న నిరసనకారులతో వాగ్వాదానికి దిగారు.

సీఏఏకు వ్యతిరేకంగా భారత్‌ బంద్‌కు పిలుపునివ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కంజూర్ మార్గ్ రైల్వే స్టేషన్‌లో బహుజన్ క్రాంతి మోర్చా నేతలు ట్రాక్ పై కూర్చుని నిరసనలు తెలిపారు. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన ప్రయాణికులు రైలు దిగి వారితో గొడవపడ్డారు. ఈ ఘటన ఉదయం 8 గంటల నుంచి 8:30 గంటల మధ్య జరిగిందని పోలీసులు తెలిపారు. ఇక వీరు లోకల్ ట్రైన్‌కు ఎదురుగా కూర్చోవడంతో ఈ రైలు నిలిచిపోవడమే కాకుండా ఈ ప్రభావం మిగతా రైళ్ల పై కూడా పడింది.

Mumbai commuters clash with anti CAA protestors who sat on railway tracks

రైల్ రోకో కార్యక్రమంలో భాగంగా రైళ్లను నిలిపివేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునే సరికే ప్రయాణికులు గొడవపడుతుండటం చూశారు. అక్కడి నుంచి పక్కకు వెళ్లాల్సిందిగా ప్రయాణికులు కోరడంతో నిరసనకారులు వెనక్కు తగ్గలేదని దీంతో నిరసనకారులు ప్రయాణికుల మధ్య గొడవ చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొందని పోలీసులు తెలిపారు. ఇక రంగప్రవేశం చేసిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకోవడంతో రైలు ముందుకు కదిలింది. కొంతమంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

Recommended Video

Pawan Kalyan Clarification On CAA | Janasena BJP Alliance || Oneindia Telugu

నిరసనకారులు రైల్వే ట్రాక్‌పై కూర్చోవడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. మరికొన్ని రైళ్లు ముందు స్టేషన్లలో నిలిచిపోయాయి. దీంతో దాదాపు అరగంట పాటు రైళ్ల సర్వీసులకు అంతరాయం కలిగింది. ముంబైలో ముఖ్యంగా ఉదయం వేళల్లో రైళ్లు రద్దీగా ఉంటాయి. చాలామంది తమ ఆఫీసులకు త్వరగా చేరుకునేందుకు లోకల్ ట్రైన్స్‌ను ఆశ్రయిస్తారు. ఈ క్రమంలోనే రైల్ రోకో చేయడంతో నిరసనకారులతో గొడవకు దిగారు ప్రయాణికులు.

English summary
As part of Bharat Bandh, a group of anti-CAA protesters blocked rail tracks which affected Mumbai local train services. Commuters, who were getting late to work, clashed with these protesters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X