వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'శోభా డే' అపహస్యం చేసిన పోలీసుకు ఆపరేషన్, 80 కిలోలు తగ్గే అవకాశమన్న వైద్యులు

రచయిత్రి శోభాడే అపహస్యపు ట్వీట్ తో వార్తల్లో నిలిచిన మధ్యప్రదేశ్ పోలీస్ దౌలత్ రామ్ జోగావత్ ముంబై వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: రచయిత్రి శోభా డే అపహస్యపు ట్వీట్ తో వార్తల్లో నిలిచిన మధ్యప్రదేశ్ పోలీస్ దౌలత్ రామ్ జోగావత్ కు ముంబై వైద్యులు విజయవతంగా శస్త్రచికిత్స చేశారు.ఈ శస్త్రచికిత్స ద్వారా దౌలత్ రామ్ జోగావత్ 80 కిలోల బరువు తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. శోభా డే ట్వీట్ ద్వారా దౌలత్ రామ్ కు శస్త్రచికిత్స జరిగింది.

ముంబాయిలోని సైఫీ ఆసుపత్రిలో డాక్టర్ ముఫజల్ లక్టావాలా నేతృత్వంలో వైద్యుల బృందం ఆయనకు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ నిర్వహించింది.

గంటన్నరపాటు సాగిన ఆపరేషన్ అనంతరం ఆయనను వార్డుకు తరలించారు.ఆయన లేచి నడవగలుగుతున్నారని వైద్యులు ప్రకటించారు. ఈ ఆపరేషన్ తో ఆయన తీసుకొనే ఆహరం పరిమాణం మరింత తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు.

Mumbai: Cop ‘fat-shamed’ by Shobhaa De surgery completed

ప్రస్తుతం దౌలత్ రామ్ 180 కిలోల బరువున్నాడు.అయితే ఈ శస్త్రచికిత్స ద్వారా ఆయన 80 కిలోల బరువు తగ్గే అవకాశం ఉందని వైద్యులు ప్రకటించారు.

ముంబై కార్పోరేషన్ ఎ్ననికల బందోబస్తుకు దౌలత్ రామ్ వచ్చారు.ఆ సమయంలో భారీ బందోబస్తు అనే వ్యాప్షన్ తో ఆయన ఫోటోను శోభా డే పోస్ట్ చేశారు.

ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. చికిత్స అందిస్తామంటూ డాక్టర్ లక్టావాలా ట్విట్గర్ ద్వారా ముందుకు వచ్చారు. ఈ జిప్టుకు చెందిన ప్రపంచంలోనే భారీకాయురాలు ఇమన్ అహ్మద్ కు కూడ వైద్యం చేస్తుందీ కూడ డాక్టర్ లక్టావాలాయే.

English summary
The Madhya Pradesh policeman whose weight problem became a subject of online discussion after he was "fat-shamed" by writer-columnist Shobhaa De on Twitter, gastric bypass surgery conducted at mumbai on friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X