వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడుక్కుంటా.. అనుమతినివ్వండి: ఓ ముంబై పోలీస్ ధీనగాథ..

|
Google Oneindia TeluguNews

ముంబై: నెల జీతం పైనే నెట్టుకొచ్చే వేతన జీవులకు ఒక నెల జీతం ఆలస్యమైతేనే జీవితం అతలాకుతలమైనట్టుగా అనిపిస్తుంది. అలాంటిది.. ఏకంగా నెలల తరబడి జీతమే రాకపోతే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది. ముంబైలోని ధ్యానేశ్వర్ అనే కానిస్టేబుల్ కు ఇదే పరిస్థితి ఎదురైంది. 2 నెలలుగా తనకు జీతం ఇవ్వకపోవడంతో.. ఇక 'నేను పోలీస్ యూనిఫాంలోనే అడుక్కుంటాను అనుమతినివ్వండి' అంటూ ఉన్నతాధికారులకు ఓ వినతిపత్రం అందజేశారు.

ముంబైకి చెందిన ధ్యానేశ్వర్‌ అహిర్రావ్‌ తొలుత స్థానిక మురోల్‌ ఆయుధ విభాగంలో పనిచేసేవాడు. కొన్ని రోజుల కిందట ఇతన్ని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం మాతోశ్రీకి వద్ద విధుల్లో నియమించారు. మార్చారు. అదే సమయంలో అతని భార్య కాలు విరగడంతో రెండు రోజుల పాటు ఉద్యోగానికి సెలవు పెట్టాడు. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి గాను మార్చి 20 నుంచి 22 వరకు లీవు పెట్టి వెళ్లాడు.

Mumbai cop seeks permission to beg in uniform for not receiving salary

ఇదే విషయాన్ని ఇన్ ఛార్జికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. ఆ తర్వాత భార్య ఆపరేషన్ నిమిత్తమై మరో 5రోజులు సెలవు పెట్టాడు. అనంతరం మార్చి 28వ తేదీన మాత్రోశ్రీ విద్ద తిరిగి విధులకు హాజరయ్యాడు. ఇది జరిగి రెండు నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకూ అతనికి జీతం రాలేదు. రెండు నెలలుగా జీతం రాకపోవడంతో పోలీసు దుస్తుల్లోనే అడుక్కునేందుకు తనకు అనుమతి ఇవ్వాల్సిందిగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, గవర్నర్ విద్యాసాగర్ రావు, అలాగే పోలీస్ ఉన్నతాధికారులకు ఆయన లేఖలు రాశారు.

లేఖల్లో ధ్యానేశ్వర్ ఏం చెప్పారంటే.. ' అనారోగ్యంతో ఉన్న నా భార్యను, నా వృద్ద తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉన్నది. నర్సరీ చదువుకునే ఓ కూతురు కూడా ఉంది. వీళ్లను పోషించడంతో పాటు ప్రతీ నెలా లోన్ డబ్బులు కట్టాల్సి ఉంది. రెండు నెలలుగా జీతం రాకపోవడంతో వీటన్నింటికీ నాకు చాలా ఇబ్బంది అవుతోంది. నాకు జీతం కావాలి. దాని గురించి ఆరా తీస్తే నా జీతం నిలిపివేసినట్టుగా తెలిసింది. కాబట్టి పోలీస్ దుస్తుల్లోనే అడుక్కోవడానికి నాకు అనుమతి ఇవ్వండి, అలాగైనా నా కుటుంబాన్ని పోషించుకుంటా' అని హృదయ విదారకంగా చెప్పుకొచ్చాడు.

ఇదే విషయమై ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. 'ప్రభుత్వ నిబంధన ప్రకారం.. ఇన్ చార్జికి చెప్పకుండా విధులకు గైర్హాజరయ్యేవారికి జీతం నిలిపివేయబడుతుంది' అని పేర్కొన్నారు. ధ్యానేశ్వర్ మాత్రం తాను ఇన్ చార్జికి చెప్పే సెలవు పెట్టినట్టు చెబుతున్నారు. చూడాలి మరి.. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కానిస్టేబుల్ లేఖపై ఎలా స్పందిస్తుందో!

English summary
A police constable attached with Mumbai police is seeking a permission to beg-in official uniform for allegedly not receiving salary since past two months over the leaves that he had taken for his wife's medical treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X