వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్‌టార్షన్ రాకెట్... టార్గెట్ ఎమ్మెల్యే,ఎంపీ,బ్యూరోక్రాట్స్... బట్టబయలు చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్...

|
Google Oneindia TeluguNews

సెక్స్‌టార్షన్ రాకెట్... ఇదో ట్రాప్... ఎంపీలు,ఎమ్మెల్యేలు,ప్రభుత్వ ఉన్నతాధికారులే లక్ష్యంగా సాగుతున్న ఓ నేర దందా. తాజాగా ముంబై క్రైమ్ బ్రాంచ్ సైబర్ సెల్ పోలీసులు దీన్ని బట్టబయలు చేశారు. నిందితులకు సంబంధించిన దాదాపు 175 ఫేక్ ఫేస్‌బుక్ ఖాతాలను తొలగించారు. ఈ ఖాతాలతోనే ప్రజాప్రతినిధులు,బ్యూరోక్రాట్స్‌ను బ్లాక్‌మెయిల్,వేధింపులకు గురిచేస్తున్నట్లు నిర్దారించారు. వీరి ట్రాప్‌లో చిక్కుకున్న చాలామంది భారీగా డబ్బు సమర్పించుకున్నారు. ఈ రాకెట్‌కి సంబంధించి పోలీసుల దర్యాప్తులో పలు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.

ఎలా ట్రాప్ చేస్తారంటే...

ఎలా ట్రాప్ చేస్తారంటే...

ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల కథనం ప్రకారం... కొంతమంది వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నకిలీ ఖాతాలు తెరుస్తున్నారు. ఇందులో అందమైన అమ్మాయిల ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్‌గా పెడుతున్నారు. ఆపై ఎమ్మెల్యేలు,ఎంపీలు,బ్యూరోక్రాట్స్‌కు ఈ నకిలీ ఖాతాల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతారు. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగానే అమ్మాయి లాగా వారితో మాటలు కలుపుతారు. మెల్లిగా ముగ్గులోకి దింపుతారు.

వాట్సాప్ వీడియో కాల్‌లో పోర్న్...

వాట్సాప్ వీడియో కాల్‌లో పోర్న్...

ఇక వారు తమ దారిలోకి వచ్చారని నిర్ణయించుకున్నాక.. కాంటాక్ట్ నంబర్ తీసుకుంటారు. ఆపై వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తారు. అమ్మాయే కాల్ చేస్తుందని నమ్మి సదరు వ్యక్తులు ఆ కాల్ లిఫ్ట్ చేస్తారు. కానీ అక్కడ అమ్మాయికి బదులు పోర్న్ వీడియో ప్లే అవుతుంది. బహుశా ఆ వీడియో తర్వాత అమ్మాయి మాట్లాడుతుందేమోనని ఎదురుచూస్తారు. కానీ ఇంతలోనే కాల్ కట్ అయి వాట్సాప్‌‌కు మెసేజ్ వస్తుంది. ఓపెన్ చేస్తే అందులో వాట్సాప్ వీడియో కాల్‌లో పోర్న్ చూస్తున్న స్క్రీన్ షాట్స్ ఉంటాయి.

బ్లాక్‌మెయిల్ షురూ....

బ్లాక్‌మెయిల్ షురూ....

తాము అడిగినంత డబ్బు ఇవ్వాలని... లేదంటే మీరు పోర్న్ చూస్తున్న ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని ఆ గ్యాంగ్ బెదిరింపులకు దిగుతుంది. ఆ వ్యక్తి లొంగుతాడా లేదా అన్నది నిర్దారించుకునేందుకు మొదట తక్కువ మొత్తాన్నే డిమాండ్ చేస్తారు. ఒకవేళ అతను భయపడిపోయి ఆ డబ్బు ఇచ్చాడనుకుంటే... ఇక తర్వాత నుంచి అసలు టార్చర్ షురూ అవుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు కాల్స్ చేసి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇలా ఈ గ్యాంగ్ ట్రాప్‌లో చిక్కుకుని చాలామంది డబ్బులు సమర్పించుకున్నారు.

ఎట్టకేలకు ముగ్గురి అరెస్ట్...

ఎట్టకేలకు ముగ్గురి అరెస్ట్...

ఇటీవల అందిన ఫిర్యాదులతో ఈ గ్యాంగ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన ముంబై క్రైమ్ బ్రాంచ్ సైబర్ సెల్ పోలీసులు.. సోమవారం(ఫిబ్రవరి 22) ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. హర్యానా,ఉత్తరప్రదేశ్,రాజస్తాన్ ట్రైజంక్షన్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రమేయం ఉన్న మరికొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితులకు చెందిన 175 ఫేక్ ఫేస్‌బుక్ ఖాతాలను డిలీట్ చేశారు. పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా వీరి ట్రాప్‌లో చిక్కుకుని మోసపోయినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

ఆగ్రాలోనూ ఇదే తరహా ఘటన...

ఆగ్రాలోనూ ఇదే తరహా ఘటన...

ఇదే సెక్స్‌టార్షన్ కేసుకు సంబంధించి రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో 23 ఏళ్ల ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు ఓ మహిళకు కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఫేక్ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఓ వ్యక్తికి వల వేసిన ఆ అమ్మాయి... మాటలతోనే అతన్ని మాయ చేసింది. ఆపై వాట్సాప్ వీడియో కాల్స్ చేసి అతన్ని నమ్మించింది. అలా ఓరోజు వాట్సాప్ వీడియో కాల్‌లోనే అకస్మాత్తుగా తన దుస్తులు విప్పేసింది. తీరా.. ఆ వీడియో రికార్డింగ్‌తో అతన్ని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే... ఆ వీడియోను మీ కుటుంబ సభ్యులు,బంధువులకు పంపిస్తానని బెదిరించింది. మొదట రూ.5వేలు సమర్పించుకున్న అతను... ఇక ఆ తర్వాత తనవల్ల కాదని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ వ్యవహారంతో సంబంధమున్న యువకుడిని అరెస్ట్ చేశారు.ప్రస్తుతం ఆ మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
The Cyber Cell of Mumbai Crime Branch on Monday arrested three people, froze 175 Facebook accounts and busted a massive ‘sextortion’ racket targeting politicians, bureaucrats and celebrities. The accounts were using photographs of women to target people, said cyber cell officials
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X