హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Redzones:ఏపీ,తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 130 జిల్లాల్లో రెడ్ జోన్లు, మెట్రో నగరాలు కూడా..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రభావిత జిల్లాలను కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. 733 జిల్లాల్లో 130 రెడ్ జోన్ జిల్లాలు ఉన్నట్టు పేర్కొన్నది. ఇందులో మెట్రో నగరాలు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, హైదరాబాద్, బెంగళూరు రెడ్ జోన్‌లో ఉండటంతో మే 3 తర్వాత కూడా ఇక్కడ లాక్‌డౌన్ కొనసాగే అవకాశం ఉంది.

యూపీలో ఎక్కువ

యూపీలో ఎక్కువ

ఆరెంజ్ జోన్ పరిధిలో కొన్ని ఆంక్షలు సడలింపులు ఇవ్వనుండగా... గ్రీన్ జోన్ పరిధిలో మినహాయింపులు ఇస్తారు. ఉత్తరప్రదేశ్‌ 19 జిల్లాల్లో రెడ్‌జోన్‌తో మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత మహారాష్ట్ర 14 జిల్లాలు, తమిళనాడులో 12 జిల్లాలు, ఢిల్లీలో 11 జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. ముంబై శివారు థానే, పల్గార్ రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి. పుణె, నాసిక్, నాగ్ పూర్, షోలాపూర్, యవత్మాల్, ఔరంగాబాద్, సతారా, ధూలే, అకోలా, జగల్ జాన్, రాయిగడ్ కూడా రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి.

ఢిల్లీలో అన్ని జిల్లాలు..

ఢిల్లీలో అన్ని జిల్లాలు..

ఢిల్లీ ఎన్ సీ ఆర్ పరిధి, గురుగ్రామ్, గౌతమ్ బుద్దనగర్ రెడ్ జోన్‌లో ఉండగా.. ఘజియాబాద్ ఆరెంజ్ క్యాటగిరీలో ఉంది. లక్నో, ఆగ్రా, సహరన్ పూర్, కాన్పూర్, మొరదాబాద్, ఫిరోజాబాద్, బులంద్ షహర్, మీరట్, రాయ్ బరెలీ, వారణాజి, బీజ్నూర్, అమ్రోహ, సంత్ కబీర్ నగర్, అలీఘడ్, ముజఫర్ నగర్, రాంపూర్ మథురా, బరేలి రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి.

తెలంగాణలో ఆరు..

తెలంగాణలో ఆరు..

తెలంగాణ రాష్ట్రంలో ఆరు జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. 18 జిల్లాలు ఆరంజ్ జోన్, 9 జిల్లాలు గ్రీన్ జోన్లుగా ప్రకటించింది. హైదరాబాద్, సూర్యాపేట, వరంగల్ అర్బన్‌లో ప్రభావం ఎక్కువగా ఉంది. వీటితోపాటు రంగారెడ్డి, మేడల్చ్ మల్కాజిగిరి, వికారాబాద్‌ కూడా రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి. పెద్దపల్లి, నాగర్ కర్నూలు, ములుగు, భద్రాచలం కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉండగా.. మిగతా 18 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి.

4

4

ఏపీలో ఐదు జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. ఏడు జిల్లాలు ఆరంజ్ జోన్‌లో ఉండగా.. ఒక విజయనగరం జిల్లా మాత్రమే గ్రీన్ జోన్‌ పరిధిలో ఉంది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న కర్నూలు, గుంటూరు రెడ్ జోన్‌లో ఉన్నాయి. కృష్ణ, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు కూడా రెడ్ జోన్‌లో ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖపట్టణం జిల్లాలు ఆరంజ్ జోన్‌లో ఉన్నాయి.

English summary
Union health ministry has split 733 districts across India into red, orange and green zones, designating all metropolitan citiesinto the 'no activity' zone even after the lockdown ends on May
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X