వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందుత్వం, బ్రాహ్మణవాదంపై నోరుపారేసుకున్న డాక్టర్ బాబు! క‌ట‌క‌టాల వెన‌క్కి

|
Google Oneindia TeluguNews

ముంబై: ఫేస్‌బుక్ ఉంది క‌దా అని ఇష్టానుసారంగా పోస్టులు, షేర్లు చేసుకుంటూ పోతే- ఎదురు దెబ్బ‌లు త‌గ‌ల‌క పోవు. హిందుత్వం, బ్రాహ్మ‌ణ‌వాదంపై తోచింది రాసుకుంటూ పోయారు ఓ డాక్ట‌ర్ బాబు. అత్యంత వివాదాస్ప‌ద‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేశారు. చివ‌రికి- క‌ట‌క‌టాల పాల‌య్యారు. ఆయ‌న‌ పేరు డాక్ట‌ర్ సునీల్‌కుమార్ నిషాద్‌. హోమియోప‌తి డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. అఖిల భార‌త వెనుక‌బ‌డిన, మైనారిటీ సామాజిక వ‌ర్గ ఉద్యోగుల సమాఖ్య (బామ్‌సెఫ్‌) స‌భ్యునిగా కొన‌సాగుతున్నారు.

రాహుల్ గాంధీ ఫిరంగిలాంటోడు..నేను ఏకే - 47 టైప్‌ రాహుల్ గాంధీ ఫిరంగిలాంటోడు..నేను ఏకే - 47 టైప్‌

కొన్నేళ్లుగా ముంబైలోని విక్రోలి ప్రాంతంలో నివ‌సిస్తున్నారు. మ‌నువాదం అంటే అమితంగా ఇష్ట‌ప‌డతార‌ని, బ్రాహ్మ‌ణవాదం, హిందుత్వం అంటే ఆయ‌న‌కు అస‌హ్యించుకుంటున్నార‌ని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Mumbai doctor held for ‘anti-Hindu’ Facebook posts

హిందుత్వం, బ్రాహ్మ‌ణ‌వాదం ప‌ట్ల రెండేళ్లుగా అభ్యంత‌ర‌క‌ర‌మైన పోస్టులు చేస్తున్నార‌ని అంటూ- అదే ప్రాంతానికి చెందిన ర‌వీంద్ర తివారీ అనే వ్య‌క్తి స్థానిక పార్క్‌సైట్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. తివారీ ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. త‌న‌పై కేసు న‌మోదైన విష‌యాన్ని తెలుసుకున్న నిషాద్ రెండురోజులుగా అజ్ఞాతంలో గ‌డిపారు.

దీనితో అత‌నిపై పార్క్‌సైట్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ముంద‌స్తు బెయిల్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, ముంబై సెష‌న్స్ కోర్టు ఆవ‌ర‌ణ‌లో ఉన్న‌ట్లు పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీనితో పోలీసులు వ‌ల‌ప‌న్ని ఆయ‌న‌ను అరెస్టు చేశారు. మ‌తాన్ని కించ‌ప‌ర‌చ‌డం, ఆ మ‌త‌స్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయ‌డ‌, మ‌త ప‌ర‌మైన వ్యాఖ్య‌లు చేస్తూ, శాంతియుత వాతావ‌ర‌ణానికి భంగం క‌లిగించడాన్ని నిరోధించే చ‌ర్య‌ల కింద నిషాద్‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు పార్క్‌సైట్ సీనియ‌ర్ ఇన్స్‌పెక్ట‌ర్ విలాస్ జాద‌వ్ తెలిపారు.

English summary
MUMBAI POLICE on Wednesday arrested a 38-year-old doctor for allegedly posting “anti-Hindu” and “anti-Brahminical” comments on Facebook. The Parksite Police in Vikhroli had registered an FIR against Dr Sunilkumar Nishad on Saturday based on a complaint by Ravindra Tiwari, also a Vikhroli resident, who said he was a social activist. The police had been on the lookout for Nishad for the past two days and arrested him from South Mumbai on Wednesday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X