వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టిస్ట్ హేమ కేసులో ఆర్థిక కోణం: బెడ్ రూంలో వెకిలి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రముఖ చిత్రకారిణి హేమా ఉపాధ్యాయ, ఆమె న్యాయవాది హరీష్ భాంబనీ జంట హత్యలు ముంబైలో కలకలం రేపాయి. ఈ జంట హత్యల వెనుక ఆర్థికపరమైన కారణాలు ఉండవచ్చునని పోలీసులు చెబుతున్నారు.

సమాచారం మేరకు... హేమా ఉపాధ్యాయ తన ఆర్ట్ వర్క్‌కు సంబంధించిన వాటిని 'చార్కోప్' వేర్‌హౌస్ యజమాని వద్ద ఉంచుతుంది. అతనితో హేమాకు రూ.5 లక్షల విషయమై గొడవలు ఉన్నాయి.

హేమా ఉపాధ్యాయ, ఆమె న్యాయవాది హరీష్ భాంబని చివరిసారి చార్కోప్ టవర్ల మధ్య గల వేర్ హౌస్‌లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. డిసెంబర్ 11న రాత్రి ఎనిమిదిన్నర గంటలకు వారి ఫోన్లు అక్కడే స్విచ్చాఫ్ అయ్యాయి.

అలాగే, మృతులు ఇద్దరు చివరిసారి లక్ష్మీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద కనిపించారు. ఈ ఎస్టేట్ హేమా ఉపాధ్యాయ స్టూడియోకి దగ్గరలో ఉంది. వారు చివరిసారి కనిపించినప్పుడు శుక్రవారం ఆరున్నర అవుతోంది. ఆ తర్వాత రాత్రి వేర్ హౌస్ వద్ద ఉన్నట్లు తేలింది. వారి ఫోన్లు కూడా అదృశ్యమయ్యాయి.

ఇదిలా ఉండగా, పోలీసులు జంట హత్యల నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం నాడు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఓ డ్రైవర్, ఇద్దరు పనివాళ్లు ఉన్నారు. వారిని పోలీసులు ప్రశ్నించారు.

కాగా, ఈ కేసులో ట్రక్కు డ్రైవర్ సాక్షి అని తెలుస్తోంది. శవాలు, అనుమానితులను ఆ ట్రక్కులోనే తరలించారని తెలుస్తోంది. అయితే, ట్రక్కు డ్రైవర్‌కు హత్యల గురించి తెలియదని తెలుస్తోంది. నిందితులు ట్రక్కును ఆపి.. తమ వద్ద కొంత వేస్ట్ మెటీరియల్ ఉందని, వాటిని డ్రెయినేజీలో పడేయాలని ట్రక్ డ్రైవర్‌కు చెప్పారని తెలుస్తోంది.

 Mumbai Double Murder Case: Truck driver who drove dead bodies becomes witness

హేమా ఉపాధ్యాయకు భర్తతో గొడవలు

హేమా ఉపాధ్యాయకు కొన్నాళ్లుగా భర్తతో పడటం లేదు. కట్టుకున్నవాడి వేధింపులు తాళలేక విడాకులకు సిద్ధమైంది. ఇందుకోసం ఓ లాయర్‌ను కూడా నియమించుకుంది. ఈ వివాదం కొనసాగుతుండగానే ఆమెతోపాటు ఆమె లాయర్ కూడా విగతజీవులు కావడం గమనార్హం.

శనివారం సాయంత్రం ముంబై శివారులోని ఓ మురికికాలువలో డబ్బాలో వారి మృతదేహాలు బయటపడ్డాయి. హేమా ఉపాధ్యాయ్ (45), ఆర్టిస్ట్ చింతన్ ఉపాధ్యాయ్‌కి కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. అటు తర్వాత ఆమెను చింతన్ మానసికంగా, శారీరకంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

హేమ బెడ్‌రూమ్‌లో అశ్లీల చిత్రాలు చిత్రీకరించడం వంటి వెకిలిచేష్టలకు కూడా దిగినట్లు తెలుస్తోంది. భరించలేక హేమ విడాకులకు సిద్ధమైంది. 2013లో భర్తపై కేసు పెట్టింది. ఇందుకోసం లాయర్ హరీశ్ భాంబనీని ఏర్పాటు చేసుకుంది.

కేసు విచారణ సాగుతుండగా శనివారం సాయంత్రం కందివాలీ ఏరియాలోని ఓ మురికి కాలువలో పారిశుద్ధ్య కార్మికులకు రెండు కార్డ్‌బోర్డు బాక్స్‌లు కనిపించాయి. వాటిని తెరిచి చూడగా రెండు మృతదేహాలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా మృతులు హేమా ఉపాధ్యాయ్, ఆమె తరఫు లాయర్ హరీశ్ భాంబనీగా వెల్లడించారు.

హేమా ఉపాధ్యాయ్ అసలు పేరు హేమా కులకర్ణి. గుజరాత్‌లోని బరోడాలో జన్మించిన ఆమె చిత్రకారిణి, శిల్పకారిణిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. బొమ్మలను చిత్రించడం, శిలలను శిల్పాలుగా మలచడం, అరుదైన వస్తువులు సేకరిస్తుంటారు. వాటిని ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తుంటారు.

ప్యారిస్ వంటి ప్రసిద్ధనగరాల్లోనూ ఆమె చిత్రాల ఎగ్జిబిషన్లు జరిగాయి. జాతీయ లలిత కళా అకాడమీ, గుజరాత్ లలిత కళా అకాడమీ వంటి అనేక అవార్డులు హేమను వరించాయి. తనలాంటి కళాకారుడే అయిన రాజస్థాన్‌కు చెందిన చింతన్ ఉపాధ్యాయ్‌ని 1998లో పెండ్లి చేసుకున్నాక ముంబైలో స్థిరపడింది.

కొన్నాళ్లు కాపురం సాఫీగా సాగింది. అటు తర్వాత చింతన్ వేధింపులు పెరిగాయి. విడాకుల కేసు నడుస్తోంది. ఇంతలో హేమ, ఆమె తరఫు లాయర్ శవాలై తేలారు. ఈ ఘటనలో భర్త చింతన్‌పై కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.

English summary
In the sensational double murder case of internationally-acclaimed artist Hema Upadhyay and her advocate Harish Bhambani, the police on Sunday, Dec 13, said that the cause of murder can be a money-related dispute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X