వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైవ్ లో మహిళా న్యాయవాది ఆత్మహత్య యత్నం.. కాపాడిన పోలీసులు

ముంబైలో ఓ మహిళా న్యాయవాది ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆత్మహత్య యత్నానికి పాల్పడగా, ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబయి: ముంబయిలో ఓ కాలేజీ విద్యార్థి ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ ఆత్మహత్య కు పాల్పడి నెల గడిచిందో లేదో తాజాగా ఓ మహిళ కూడా అలాగే చేయబోయింది. ఫేస్‌బుక్‌ లైవ్‌లో సూసైడ్‌ చేసుకునేందుకు యత్నించింది. అయితే ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

అసలేం జరిగిందంటే.. మహారాష్ట్రకు చెందిన ప్రియాంక జెథలాల్‌ మరు అనే న్యాయవాది లైవ్‌ స్ట్రీమ్‌లో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. సెవ్రీ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం 18వ అంతస్థుకు ఎక్కిన ప్రియాంక.. ఫేస్‌బుక్‌ లైవ్‌ స్ట్రీమ్‌ ఆన్‌ చేసింది. తాను అక్కడి నుంచి దూకబోతున్నానని లైవ్‌లో చెప్పింది.

facebook-live

అయితే ప్రియాంక భవనం ఎక్కుతుండగా చూసిన స్థానికులు పోలీస్‌ కంట్రోల్‌ రూంకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ప్రియాంకను కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించి.. కౌన్సిలింగ్‌ ఇప్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గత నెలలో 23 ఏళ్ల కాలేజీ విద్యార్థి లైవ్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బంద్రా శివారులోని ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ 19వ అంతస్తు నుంచి దూకి చనిపోయాడు.

English summary
A month after a youth live streamed his suicide on Facebook before jumping to death, a woman lawyer in Mumbai attempted to end her life in the similar way but was stopped by cops in time, police said on Saturday. 32-year-old Priyanka Jethalal Maru had planned to jump off from the 18th floor of an under-construction building in Sewri area on Friday morning, police said. The woman was also seen shooting her video, they said. A resident of a nearby building quickly contacted the control room, following which a police team rushed to the spot and stopped her from taking this extreme step. Inspector Shalini Sharma, who is trained in handling such situations, was instrumental in dissuading Maru. After taking her in custody, police admitted her to a hospital in Parel. She is getting counselling, it said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X