వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైలో భారీ వర్షాలు: రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం, రైళ్ల నిలిపివేత

|
Google Oneindia TeluguNews

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు ముంచెత్తడంతో రహదారులన్నీ జలమయంగా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలను చెరువులను తలపించాయి. బుధవారం కురిసిన భారీ వర్షంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.

భారీ వర్షాల కారణంగా వరద ముప్పు పొంచి వుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పలు రైలు సర్వీసులు నిలిపివేశారు. సెంట్రల్, హార్బర్ లైన్లలో రాకపోకలు నిలిచిపోయినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తెలిపింది. బాంబే హైకోర్టు కూడా బుధవారం సెలవు ప్రకటించినట్లు తెలిపింది.

 Mumbai Flooded After Heavy Overnight Rain, Trains Suspended

గత 24 గంటల్లో ముంబై పశ్చిమ ప్రాంతంలో 280 మి.మీల వర్షాపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో కూడా ముంబై నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే భారీ వర్షంతో ముంబై నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలు రైల్వే స్టేషన్లలోకి వరద నీరు చేరుకుంది.

భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక గత 24 గంటల్లో ముంబైలోని పశ్చిమ ప్రాంతం (శాంతాక్రజ్ అబ్ర్వేటరీ)లో 286.4 మి.మీలు, కొలాబా అబ్జర్వేటరీ(సౌత్ ముంబై)లో 147.8 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ తెలిపింది.

ఇప్పటికే భారీ వర్షాలు, వరదల కారణంగా ముంబై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయం చేయాలంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే కరోనాతో ఉక్కిరిబిక్కిరవుతున్న ముంబై ప్రజలకు ఈ భారీ వర్షాలు మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

English summary
Heavy overnight rain in Mumbai has hit rail and road traffic after several parts in the city were water-logged. The weather department has warned of a flood-like situation in the low-lying areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X