వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొట్ట‌మొద‌టి హెచ్ఐవీ క్లినిక్ః అలాంటి వారికి మాత్ర‌మే ప్ర‌వేశం..ఇత‌రులు నిషిద్ధం

|
Google Oneindia TeluguNews

ముంబైః స‌మాజంలో వివ‌క్ష‌త‌ను ఎదుర్కొంటున్న స్వ‌లింగ సంప‌ర్కులు, సెక్స్ వ‌ర్క‌ర్ల కోసం హ‌మ్ స‌ఫ‌ర్ ట్ర‌స్ట్-మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఓ ముంద‌డుగు వేశాయి. వారి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌త్యేకంగా హెచ్ఐవీ క్లినిక్ ను ఏర్పాటు చేసింది. ఈ క్లినిక్‌లో సెక్స్ వ‌ర్క‌ర్లు, స్వలింగ సంప‌ర్కుల‌కు మాత్ర‌మే చికిత్స అందిస్తారు. ఇత‌రుల‌కు ప్ర‌వేశం ఉండ‌దు. ముంబైలోని ఈస్ట్ శాంతాక్ర‌జ్ లో ఈ హెచ్ఐవీ క్లినిక్ ఏర్పాటైంది.

గురువారం సాయంత్రం నుంచి ఇది అందుబాటులోకి వ‌చ్చింది. ఈ క్లినిక్ ప‌ర్య‌వేక్ష‌ణ మొత్తం హ‌మ్ స‌ఫ‌ర్ ట్ర‌స్ట్ ఆధీనంలో ఉంటుంది. దీనికి అవ‌స‌ర‌మైన నిధులు, వైద్య ప‌రిక‌రాల‌ను మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం స‌మ‌కూర్చుతుంది. సెక్స్ వ‌ర్క‌ర్ల‌ జీవన ప్రమాణాల‌ను మెరుగుప‌ర్చ‌డానికి, నాణ్య‌మైన వైద్యాన్ని అందించ‌డానికి హ‌మ్ స‌ఫ‌ర్ ట్ర‌స్ట్ కొన్నేళ్లుగా కృషి చేస్తోంది. సొంతంగా నిధుల‌ను స‌మకూర్చుకుని వారి సంక్షేమానికి వినియోగిస్తోంది.

నశించిన మానవత్వం: కారు బోనెట్ పై ఈ వ్యక్తిని డ్రైవర్ ఎంత దూరం తీసుకెళ్లాడో తెలుసా..?నశించిన మానవత్వం: కారు బోనెట్ పై ఈ వ్యక్తిని డ్రైవర్ ఎంత దూరం తీసుకెళ్లాడో తెలుసా..?

Mumbai gets 1st community-run HIV clinic for gay men, sex workers

ఈస్ట్ శాంతాక్ర‌జ్ ప్రాంత‌మే ఎందుకంటే..!

ముంబైలో అనేక ప్రాంతాలు, రెడ్ లైట్ ఏరియాలు ఉండ‌గా ప్ర‌భుత్వం ఈస్ట్ శాంతాక్ర‌జ్ నే ఎంచుకుంది. దీనికి కార‌ణం ఉంది. ఈ ఒక్క ప్రాంతంలో వేల సంఖ్య‌లో స్వ‌లింగ సంప‌ర్కులు స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. సెక్స్ వ‌ర్క‌ర్ల సంఖ్య కూడా ఎక్కువే. హిజ్రాల సంఖ్య కూడా త‌క్కువేమీ కాదు. వారి జ‌నాభా ఎక్కువ‌గా ఉన్నందున త‌ర‌చూ సెక్స్ సంబంధిత రోగాల బారిన ప‌డుతున్న‌ట్లు హ‌మ్ స‌ఫ‌ర్ గుర్తించింది.

దీనితో ఇదివ‌ర‌కు ఈ ప్రాంతంలో ప్ర‌భుత్వ ఆధీనంలో ఉన్న ఓ హెచ్ఐవీ కౌన్సెలింగ్ కేంద్రాన్ని పూర్తిస్థాయి క్లిన‌క్ గా మార్చాల‌ని కోరుతూ ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్ర‌ణ సొసైటీ అధికారుల‌కు విజ్ఞ‌ప్తి చేసింది. ఎట్ట‌కేల‌కు ప్ర‌భుత్వం ఈ ప్ర‌తిపాద‌న‌ల‌ను ఆమోదించింది. దీనితో ఎయిడ్స్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని క్లినిక్ గా మార్పు చేశారు. దీనిపై ముంబై ఎల్‌జీబీటీక్యూ స‌మాజం హ‌ర్షం వ్య‌క్తం చేస్తోంది.

English summary
Country's first community-based centres that will provide a full range of medical services needed for antiretroviral therapy (ART) outside of a hospital set-up. Community-based organization Humsafar Trust on Thursday unveiled the centre at its Santacruz (east) office, where high-risk communities, including men having sex with men, female sex workers, transgenders, can take regular HIV treatment. Earlier, it was only counselling and testing at the centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X