వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు గుడ్లకు 1700.. సింగిల్ ఆమ్లెట్ జస్ట్ 850.. అరటిపండ్ల లాంటి మరో కథ..!

|
Google Oneindia TeluguNews

ముంబై : రెండు అరటిపండ్లకు 442 రూపాయల 50 పైసల బిల్లు కథ మరిచిపోకముందే మరో స్టోరీ వెలుగుచూసింది. ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్ నిర్వాకం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. ఓ ప్రముఖ రచయితకు సదరు హోటల్‌లో ఎదురైన వింత అనుభవం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. రెండు గుడ్లకు 1700 వసూలు చేసిన హోటల్ సిబ్బంది.. ఇక సింగిల్ ఆమ్లెట్‌కు ఎంత ఛార్జీ చేశారో చూస్తే కంగు తినాల్సిందే మరి.

ఫోర్ సీజన్స్ హోటలా మజాకా..!

ఫోర్ సీజన్స్ హోటలా మజాకా..!

ఆల్‌ ద క్వీన్స్‌ మెన్‌ పుస్తక రచయిత కార్తీక్‌ దార్‌ ఇటీవల ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్‌కు వెళ్లారు. అక్కడి సిబ్బంది ఆయన చేతిలో పెట్టిన బిల్లు చూసి అవాక్కయ్యారు. రెండు బాయిల్డ్ ఎగ్స్‌కు 1700 రూపాయలు ఛార్జీ చేయడంతో విస్తుపోయారు. సింగిల్ ఆమ్లెట్ కోసం 850 రూపాయలు వసూలు చేశారు. తిన్నదేమో తక్కువ.. బిల్లు చూస్తే మాత్రం తడిసిమోపెడైంది. ఆ క్రమంలో సదరు హోటల్ నిర్వాహకులకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. దానికోసం సోషల్ మీడియాను అస్త్రంగా మలచుకున్నారు.

<strong>షేక్‌స్పియర్ కచ్చితంగా కాదు.. మరెవరో గుర్తుపట్టారా.. నెట్టింట్లో రచ్చ..!</strong>షేక్‌స్పియర్ కచ్చితంగా కాదు.. మరెవరో గుర్తుపట్టారా.. నెట్టింట్లో రచ్చ..!

నిరసన చేద్దామా భాయ్ అంటూ ట్యాగ్

నిరసన చేద్దామా భాయ్ అంటూ ట్యాగ్

ముంబై హోటల్‌లో తనకు జరిగిన అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు కార్తీక్ దార్. రెండు అరటిపళ్లకు 442.50 చెల్లించిన బాధితుడు రాహుల్‌ బోస్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ఆందోళన వ్యక్తం చేద్దామా భాయ్‌ అంటూ క్యాప్షన్‌ పెట్టాడు. దీంతో ఆయన బిల్లును ఫోటో తీసి పోస్ట్ చేయగా బాగా వైరల్‌ అయింది. దాంతో నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ఆ రెండు గుడ్లను పెట్టిన కోడి బంగారం కూడా పెట్టిందా ? లేదంటే ఆ కోడి చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిందా?' అంటూ కామెంట్లు పెట్టారు కొందరు. అయితే ఈ వ్యవహారంపై సదరు హోటల్ ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం.

నటుడు రాహుల్ బోస్‌కు ఇలాంటి చేదు అనుభవం

నటుడు రాహుల్ బోస్‌కు ఇలాంటి చేదు అనుభవం

చండీగఢ్‌లోని మారియట్ హోటల్లో బస చేసిన నటుడు రాహుల్ బోస్‌కు కూడా ఇటీవల ఇలాంటి అనుభవమే ఎదురైంది. రెండు అరటిపండ్లు ఆర్డిరస్తే అతడికి 442.50 బిల్లు చేతిలో పెట్టారు ఆ హోటల్ సిబ్బంది. దాంతో రాహుల్‌కు చిర్రెత్తుకొచ్చి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పండ్లు కీడు చేయవని ఎవరన్నారు. ఇదే పెద్ద ఉదాహరణ అంటూ ఆ బిల్లును తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

దాంతో ఆ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ హోటల్ నిర్వాహకుల మీద నెటిజన్లు విరుచుకుపడ్డారు. హోటల్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో మారియట్ యాజమాన్యం కూడా స్పందించింది. దీనిపై విచారణ జరుపుతామని చెప్పింది. ఆ బిల్లును చూసిన ఎక్సైజ్ పన్నుల శాఖ జీఎస్టీ పరిధిలోకి రాని అరటిపండ్లకు కూడా జీఎస్టీ వేసినట్టు గుర్తించింది. 9శాతం జీఎస్టీ వేసినట్టు బిల్లులో గుర్తించి ఆ హోటల్‌కు అక్షరాలా 25వేల రూపాయల జరిమానా వేసింది.

English summary
A Mumbai hotel has charged a man named Kartik Dhar Rs 1,700 for two boiled eggs. Kartik took to the micro-blogging site, Twitter, to share his experience with Four Season Hotel in Mumbai to share the screenshot of the receipt which clearly shows that the hotel charged him Rs 1,700 for two boiled eggs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X