వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారం రోజులపాటు..: ఏక్తా ప్రాణం తీసిన ఉపవాసం

|
Google Oneindia TeluguNews

ముంబై: ఉపవాసం ఓ యువతి ప్రాణాలు తీసింది. జైన సాంప్రదాయ ప్రకారం ఏడు రోజులపాటు ఉపవాస దీక్ష చేసిన 25ఏళ్ల ఎక్తా అశుభాయి గాలా అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన గుజరాత్‌లో బుధవారం చోటు చేసుకుంది.

ఏక్తా తల్లిదండ్రులు గుజరాత్ రాష్ట్రంలోని కచ్ కోట్ది మహదేవపురిలో ఉంటున్నారు. అయితే,
మటుంగాలో నివాసం ఉండే ఏక్తా కొద్ది రోజుల క్రితం తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమె జైన సాంప్రదాయం ప్రకారం వరుసగా 8 రోజులపాటు ఉపవాస దీక్ష చేస్తోంది. అయితే, ఏడో రోజే గుండెపోటు రావడంతో ఆమె హాఠాన్మరణం చెందారు.

Mumbai: Jain woman on fast dies of heart attack

ఏక్తా బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 27 నుంచి ఏక్తా 8రోజుల ఉపవాస దీక్ష చేస్తోంది. ఐదు రోజులకే అస్వస్థతకు గురికావడంతో ఏక్తాను కచ్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. ఈ క్రమంలో డాక్టర్ తోపాటు స్థానిక జైన మత గురువు జైన్ మహారాజ్ కూడా ఆమెను ఉపవాసం విరమించాలని కోరారు. రోజులో ఒక పూటైనా భోజనం చేయాలని సూచించారు.

ఘోర పడవ ప్రమాదం: 34 మంది మృతుల్లో భారతీయ జంట, రెండేళ్ల క్రితమే పెళ్లిఘోర పడవ ప్రమాదం: 34 మంది మృతుల్లో భారతీయ జంట, రెండేళ్ల క్రితమే పెళ్లి

అయితే, అందుకు ఏక్తా అశుభాయి గాలా అంగీకరించలేదు. తాను ఉపవాసాన్ని కొనసాగిస్తానని చెప్పింది. సెప్టెంబర్ 3న ఆమె పరిస్థితి మరింత దిగజారడంతో ఆమెకు గ్లూకోస్ పెట్టారు. అప్పటికీ ఆమె వేడి నీటిని మాత్రమే తాగుతూ జైన సాంప్రదాయాన్ని కొనసాగించింది. బుధవారం రాత్రి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఏక్తా మృతి చెందిందని ఆమె బంధువులు తెలిపారు.

English summary
A 25-year-old Jain woman, Ekta Ashubhai Gala, died on Wednesday after fasting for eight days as per Jain rituals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X