వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై అగ్ని ప్రమాదం: పుట్టిన రోజునే కుష్బూ మృతి, దర్యాప్తుకు మేయర్ ఆదేశం

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Mumbai Kamala Mills Fire : ముంబై అగ్ని ప్రమాదం: కుష్బూ మృతి

ముంబై: ముంబైలో అర్ధరాత్రి చోటు చేసుకొన్న అగ్ని ప్రమాదంలో పుట్టిన రోజు జరుపుకొన్న కుష్బూ అనే మహిళ కూడ ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించారు. ఇందులో 11 మంది మహిళలు కూడ ఉన్నారు.పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ముంబైలో గురువారం నాడు చోటు చేసుకొన్న అగ్ని ప్రమాదం పలు కుటుంబాల్లో విషాన్ని నింపింది. కమల మిల్స్ కాంపౌండ్‌లోని లండన్ టాక్సీగాస్ట్రోబార్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకొంది. పుట్టిన రోజు వేడుకలకు హజరైన మహిళలు ఎక్కువగా ఈ ప్రమాదంలో మృత్యువాతపడ్డారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకొంటామని బిఎంసీ చైర్మెన్ విశ్వనాథ్ మహదేశ్వర్ ప్రకటించారు. ఈ భవనంపై గతంలో పలు దఫాలు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని సామాజిక కార్యకర్త మంగేష్ కాలాస్కర్ చెప్పారు.

పుట్టిన రోజు నాడే కష్షూ మృతి

పుట్టిన రోజు నాడే కష్షూ మృతి

ముంబై కమల మిల్స్ కాంపౌండ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పుట్టిన రోజునే కుష్బూ అనే మహిళ చనిపోయింది.ఖుష్బు అనే మహిళ తన 29 పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి హాజరైన పలువురు మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తెలిపారు.. పుట్టినరోజు జరుపుకున్న ఖుష్బు కూడా మృతి చెందిందని ఆమె కుటుంబసభ్యులు ప్రకటించారు.

అద్దాలు పగుల గొట్టి బాధితుల రక్షణ

అద్దాలు పగుల గొట్టి బాధితుల రక్షణ

అగ్నిప్రమాదం సందర్భంగా బాధితులను రక్షించేందుకు అద్దాల గోడలను పగులగొట్టామని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.హోటల్‌ చివరి అంతస్థుపైన రూప్‌టాప్‌లో ఉంది. ఇక్కడ మంటలు చెలరేగి మిగతా అంతస్థులకు వేగంగా వ్యాపించిందని అధికారులు అనుమానిస్తున్నారు.

పురుషుల మరుగుదొడ్లో దాక్కొన్నారు

పురుషుల మరుగుదొడ్లో దాక్కొన్నారు

ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగెత్తామని ప్రమాదం నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చాలా మంది మహిళలు ప్రాణభయంతో పురుషుల మరుగుదొడ్డిలోకి పరుగెత్తడం తాను చూశానని ఈ ప్రమాదం నుండి బయటపడిన ఆరోరా చెప్పారు.

విచారణకు ఆదేశం

విచారణకు ఆదేశం

ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టు బీఎంసీ మేయర్‌ విశ్వనాథ్‌ మహదేశ్వర్‌ చెప్పారు. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ భవనంపై ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. అయితే తాజా ప్రమాదంతో మరోసారి ఈ భవన విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

English summary
A 29-year-old girl celebrating her birthday was among those who died at a restaurant in Mumbai's Kamala Mills where a massive fire broke out shortly after midnight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X