వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం: 3500 మంది తరలింపు, ఇద్దరు ఫైర్‌మెన్లకు గాయాలు

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మాల్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో పొరుగునే ఉన్న 55 అంతస్తుల భవనం నుంచి సుమారు 3500 మంది ప్రజలను సురక్షితంగా బయటికి తరలించారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇద్దరు అగ్ని మాపక సిబ్బంది గాయపడ్డారు.

దక్షిణ ముంబైలోని నాగ్‌పాద ప్రాంతంలోని సిటీ సెంటర్ మాల్‌లో ఈ భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే 24 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేస్తున్నాయి.

Mumbai mall fire: 2 firemen injured, 3,500 people evacuated from nearby building

15 జంబో ట్యాంకర్స్, 250 మంది అగ్నిమాపక సిబ్బంది ఆ ఆపరేషన్లో పాల్గొన్నారు.
పోలీసుల సాయంతో పొరుగునే ఉన్న పెద్ద భవనం ఆర్కిడ్ ఎన్‌క్లేవ్ నుంచి ప్రజలను బయటకి తరలించారు.

Recommended Video

#OnionPrice : కన్నీళ్లు పెట్టిస్తున్నఉల్లి ధరలు..మరో మూడు వారాల పాటు ఇంతే..!

కాగా, లెవల్ 1న అగ్ని ప్రమాదం గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ తర్వాత మంటలు తీవ్రం కావడంతో లెవల్ 3కి చేరింది. ఇక శుక్రవారం తెల్లవారుజామున 2.34 సమయానికి ఇది లెవల్ 5 అగ్రి ప్రమాదంగా మారింది. దీంతో భారీ ఎత్తున సహాయక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సుదీర్ఘంగా శ్రమించి మంటలను ఆర్పివేశాయి.

English summary
Two firemen were injured and around 3,500 people were evacuated from a 55-storey building in Mumbai early Friday after a fire in a neighbouring mall escalated to level 5.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X