• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భాయ్ చెప్పాడు.. రూ.34కోట్లు రెడీనా? - ప్రముఖ దర్శకుడికి బెదిరింపు - కారణం తెలిస్తే షాకవుతారు

|

''ఏంటి సార్.. లాక్ డౌన్ లో కులాసాగా కాలం గడుపుతున్నారా? మళ్లీ సినిమాలు చేయాలంటే కనీసం మీరు ఉండాలిగా.. నేనేం చెబుతున్నానో అర్థమవుతోందా.. అవును.. భాయ్ చెప్పాడు.. రెండ్రోజుల్లోగా రూ.34 కోట్లు రెడీ చేసుకోండి.. చెప్పిన చోటుకు డబ్బు పంపండి..'' అంటూ బెదిరింపులు రావడంతో ప్రముఖ దర్శకుడు, నటుడు మహేశ్ మంజ్రేకర్ పోలీసులన్ని ఆశ్రయించాడు. అచ్చం సినిమాను తలపించే ఈ క్రైమ్ కేసును ముంబై యాంటీ ఎక్స్‌టార్షన్ విభాగం గంటల వ్యవధిలోనే ఛేదించింది. నేరం నేరమే అయినప్పటికీ, దాని వెనకున్న కారణాలు ఒకింత షాకింగ్ గా ఉన్నాయి. సీనియర్ ఇన్‌స్పెక్టర్ అజయ్ సావంత్ మీడియాకు చెప్పిన వివరాలివి..

సోనియాపై ముప్పేటదాడి:ఆజాద్ బాంబు -సీల్డ్ కవర్ ప్రెసిడెంట్లకు విలువుదా? సీడబ్ల్యూసీకీ ఎన్నికల డిమాండ్

నిందితుడు చాయ్‌వాలా

నిందితుడు చాయ్‌వాలా

అండర్ వరల్డ్ డాన్ అబూ సలేమ్ గ్యాంగ్ సబ్యుడినంటూ ఓ వ్యక్తి.. దర్శకనటుడు మహేశ్ మంజ్రేకర్ ఫోన్ కు మెసేజ్ లు పంపాడు. వెంటనే రూ.34 కోట్లు ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించాడు. ఒకే రోజు ఏకంగా ఐదు సార్లు మెసేజ్ లు రావడంతో మంజ్రేకర్ దాదర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తొలుత ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు.. ఇందులో నిజంగానే అండర్ వరల్డ్ పాత్ర ఉందేమోననే అనుమానంతో కేసును యాంటీ ఎక్స్‌టార్షన్ విభాగానికి బదిలీ చేశారు. గంటల వ్యవధిలోనే కూపీ లాగిన పోలీసులు.. ఖేడ్ జిల్లాకు చెందిన మిలింద్ తుషాంకర్ అనే 34 ఏళ్ల యువకుణ్ని గురువారం అరెస్టు చేశారు. అతను ముంబైలోని ధారావీలో చావ్ వాలా గా జీవనం సాగించేవాడని గుర్తించారు.

లాక్‌డౌన్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయి..

లాక్‌డౌన్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయి..

డిగ్రీ వరకు చదువుకున్న మిలింద్ తుషాంకర్ కు ఉద్యోగమేదీ దొరక్క పోవడంతో ధారావీలోని 90 ఫీట్ రోడ్డులో చాయ్ బండి పెట్టుకుని జీవనం సాగించేవాడు. కరోనా లాక్ డౌన్ వల్ల జీవనోపాధి కోల్పోయి ఇంటిబాట పట్టాడు. కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో అతనికీ ఈజీ మనీ ఐడియా వచ్చింది. యూట్యూబ్ లో మాఫియా డాన్ అబూ సలేమ్ వీడియోలు, గ్యాగ్ స్టర్లు ఎలా బెదిరింపులకు దిగుతారనే క్రైమ్ కథనాలు చూసి తానూ ఓ ప్లాన్ గీశాడు. ఇటర్నెట్ ద్వారా దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ నంబర్ సంపాదించి, బెదిరింపు మెసేజ్ లు పంపాడు. కానీ కథ అడ్డం తిరిగి చివరికి అరెస్టయ్యాడు. అయితే..

సినిమా స్టైల్లో మనీ ఎక్సేంజ్..

సినిమా స్టైల్లో మనీ ఎక్సేంజ్..

‘‘మహేశ్ మంజ్రేకర్ నే ఎంచుకోడానికి ప్రత్యేకమైన కారణమేదీ లేదు. ర్యాండమ్ గా వెతుకుతుంటే అతని నంబర్ కనిపించింది. నిజానికి నేను డిమాండ్ చేసినట్లు రూ.34 కోట్లు కాకున్నా, కొన్ని లక్షలైనా చిక్కుతాయని అనుకున్నాను. ఒకవేళ అతను డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడి ఉంటే, హవాలా రూపంలో మనీ ఎక్సేంజ్ చేసుకుందామనుకున్నా'' అని నిందితుడు మిలింద్ తుషాంకర్ వాంగ్మూలం ఇచ్చినట్లు యాంటీ ఎక్స్‌టార్షన్ విభాగం పోలీసులు తెలిపారు. నిందితుడికి అండర్ వరల్డ్ తో సంబంధాలు ఉన్నాయనడానికి ఆధారాలు లేవని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుణ్ని రిమాండ్ కు తరలించామన్నారు.

కరోనా లాక్ డౌన్ దారుణం- జీతం కోతపై యజమానితో గొడవ - పీక కోసి బావిలో పడేసిన ఉద్యోగి

English summary
A 34-year-old man, who lost his livelihood due to lockdown ended at police lock-up after he impersonated as a member of an underworld gang and threatened a noted actor and filmmaker Mahesh Manjrekar for R.s 34 crores. The Anti Extortion Cell (AEC) of Mumbai Police on Thursday arrested Milind Tusankar, a native of Khed district of Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X