వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఏఎస్ అని చెప్పి ఛీటింగ్, మోసపోయిన యువతులు, ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షలు వసూల్

|
Google Oneindia TeluguNews

పొట్టకూటి కోసం కోటి తిప్పలు అని సామెత ఉంది. పెద్దలు కూడా ఇదే విషయం చెబుతుంటారు. అయితే ఓ ప్రభుత్వ ఉద్యోగి మాత్రం బుద్ది గడ్డి తిన్నాడు. ఔను తాను కలెక్టర్ అని చెప్పి, అందుకు తగినట్టు ఫోటోలు తీసి మ్యాట్రిమోనల్ సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇంకేముంది ఒక్కో అమ్మాయి అతని వలలో చిక్కి చేతిచమురు వదిలించుకున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

 ఐఏఎస్ అని చెప్పి..

ఐఏఎస్ అని చెప్పి..

ముంబైలోని దిందోసి పోలీసు స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదైంది. మ్యాట్రిమోనల్ వెబ్‌సైట్‌లో తాను మోసపోయానని యువతి ఫిర్యాదు చేశారు. దీంతో తీగ లాగితే డొంక కదిలింది. ఆదిత్య మత్రే (32) అనే సివిల్ ఇంజినీర్ తాను కలెక్టర్ అని చెప్పి, ఫోజు కోడుతూ అమ్మాయిల నుంచి అందినకాడికి డబ్బులు లాగేశాడు.

 ఫారిన్ కార్ల ముందు ఫోటోలు

ఫారిన్ కార్ల ముందు ఫోటోలు

సివిల్ ఇంజినీర్ అయిన ఆదిత్య.. మ్యాట్రిమోనల్ వెబ్‌సైట్‌‌లో తాను ఐఏఎస్ అధికారి అని పెట్టుకున్నాడు. దానికి తగినట్టు ఫారిన్ కార్ల ముందు దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేశాడు. ఇంకేముంది ఆదిత్య, కాస్ల్టీ కార్లను చూసి అమ్మాయిలు నిజమే అనుకొన్నారు. మెల్లగా కొందరు అతనితో చాట్ చేయడం ప్రారంభించారు.

ముక్కుపిండీ వసూల్

ముక్కుపిండీ వసూల్

ఇంకేముంది తనకు ఇతర అవసరాలు ఉన్నాయని.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అలా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలు ముక్కుపిండి వసూల్ చేశాడు. నగదు తీసుకున్నాక.. మాయమైపోవడం ఆదిత్య నైజం. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు 25 మంది ఆదిత్య వలలో చిక్కారు.

 25 మంది..

25 మంది..

తర్వాత తమకు ఆదిత్య కాంట్రాక్టులో లేకపోవడంతో దిందోసి పోలీసు స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆదిత్యను అరెస్ట్ చేశారు. అతనిని విచారిస్తే లీలలు వెలుగుచూశాయి. అతని మాయలో పడి దాదాపు 25 మంది మోసపోయారని పోలీసులు పేర్కొన్నారు.

English summary
Mumbai Police arrested a man who used to pose as an IAS officer on matrimonial websites to lure girls and later dupe them of lakhs of rupees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X