వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై మేయర్‌కు షాక్.. నిబంధనలు ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ చలాన్

|
Google Oneindia TeluguNews

ముంబై : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తేలేదంటున్నారు ముంబై పోలీసులు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేవారికి భారీ చలానాలు విధిస్తున్న పోలీసులు తాజాగా ముంబై మేయర్‌కు షాకిచ్చారు. నో పార్కింగ్ ప్లేస్‌లో అధికారిక వాహనాన్ని నిలిపినందుకుగానీ చలానా రాసి పంపారు.

ముంబై మేయర్ విశ్వనాథ్ మహదేశ్వర్ కోల్డోన్‌గరి సమీపంలోని విలేపార్లే ప్రాంతంలో స్థానిక శివసేన నాయకుడితో కలిసి పర్యటించారు. ఆ సమయంలో మేయర్ అధికారిక వాహనం ఫేమస్ ఫుడ్ పాయింట్ ఎదుట నిలిపారు. ఆ ప్రాంతం ఇరుకుగా ఉండటంతో పోలీసులు దాన్ని నో పార్కింగ్ ఏరియాగా ప్రకటించి బోర్డు పెట్టారు. అయితే ఆ బోర్డు కిందే మేయర్ వాహనం నిలపడంతో పోలీసులు చలాన్ జారీ చేయకతప్పలేదు. అయితే నిబంధనలు ఉల్లంఘించినందుకు మేయర్‌కు ఎంత జరిమానా విధించారన్నది తెలియలేదు.

Mumbai Mayor Fined for Parking in No-Parking Zone

ముంబై ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు పోలీసులు గత వారం రోజులుగా చర్యలుచేపట్టారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సిగ్నల్ జంపింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, నో పార్కింగ్ ఏరియాలో వాహనాలు నిలపడం తదితర ఉల్లంఘనలకు పాల్పడే వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. గత వారం రోజుల్లోనే ముంబై ట్రాఫిక్ పోలీలు లక్షల రూపాయలు ట్రాఫిక్ చలానాల రూపంలో వసూలు చేశారు.

English summary
traffic police Monday issued a challan after Mumbai Mayor Vishwanath Mahadeshwar's official vehicle was found parked in a no-parking zone. Mahadeshwar's vehicle was seen parked right under the BMC's no-parking signboard in suburban Vile Parle on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X