• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మందేస్తూ, చిందేస్తూ.. డ్యాన్స్ బార్‌లో పట్టుబడ్డ పెద్దోళ్లు.. మున్సిపల్ అధికారులు

|

ముంబై : అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు అడ్డదారులు తొక్కారు. పెద్దోళ్లతో దోస్తీ కట్టి తానాతందానా ఆడారు. ప్రభుత్వ ఉద్యోగులుగా సక్రమంగా మెలగాల్సినోళ్లు వక్రదారి పట్టారు. మత్తులో తూగుతూ ఎంజాయ్ చేసిన సదరు ఉన్నతాధికారులకు.. చివరకు పోలీసుల ఎంట్రీతో తాగిందంతా దిగిపోయింది.

వీడెక్కడి మొగుడురా బాబూ.. భార్య డ్యాన్స్ చేస్తే చంపేసిండు..!

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న డ్యాన్స్ బార్‌ను మూపించాల్సిన మున్సిపల్ అధికారులు అదే ప్లేస్‌లో మస్తుగా తాగి చిందులేశారు. వారితో పాటు వ్యాపార వేత్తలు, ఉన్నత స్ధాయి వ్యక్తులు మత్తులో తూగడం చర్చానీయాంశమైంది. ముంబైలో జరిగిన ఈ ఘటన వైరల్‌గా మారింది.

రూల్స్ బ్రేక్.. డ్యాన్స్ బార్ లీలలు

రూల్స్ బ్రేక్.. డ్యాన్స్ బార్ లీలలు

సౌత్ ముంబైలోని కొలాబాలో ఓ డ్యాన్స్ బార్ అనుమతులు లేకుండా నడుస్తోంది. రూల్స్ బ్రేక్ చేసి నడుపుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో చాలామంది మందు, విందుతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అక్కడున్నవారిలో

పెద్ద తలకాయలను చూసి కంగుతినడం పోలీసుల వంతైంది.

నిబంధనలకు తూట్లు పొడుస్తూ అక్కడ చాలాకాలంగా డ్యాన్స్ బార్ నడిపిస్తున్నారు నిర్వాహకులు. మున్సిపల్, ఇతర శాఖల అధికారుల అండదండలతో యధేచ్ఛగా అక్రమ దందా కొనసాగిస్తున్నారు. రాజకీయ అండదండలు కూడా పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల దాడుల్లో విస్మయం కలిగించే నిజాలు వెలుగుచూసినట్లు సమాచారం.

పట్టుబడ్డ పెద్దోళ్లు.. మున్సిపల్ ఉన్నతాధికారి..!

పట్టుబడ్డ పెద్దోళ్లు.. మున్సిపల్ ఉన్నతాధికారి..!

డ్యాన్స్ బార్‌పై పోలీసులు చేసిన దాడుల్లో.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారితో పాటు మరికొందరు ఉన్నతాధికారులు పట్టుబడటం గమనార్హం. అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇతర ఉన్నతస్థాయి వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న డ్యాన్స్ బార్‌కు వీరి సపోర్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తమ అడ్డాలాగా ఇక్కడ మందు, చిందుకు వేదిక చేసుకున్నట్లు సమాచారం.

15 మంది అరెస్ట్.. మహిళా సిబ్బందిపై కనికరం

15 మంది అరెస్ట్.. మహిళా సిబ్బందిపై కనికరం

డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ సహా ఆరుగురితో పాటు.. డ్యాన్స్ బార్‌కు సంబంధించిన తొమ్మిది మంది ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర హోటల్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌తో పాటు పలు ఐపీఎస్ సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. కోర్టులో హాజరు పరిచాక వారు బెయిల్‌పై విడుదలైనట్లు చెప్పారు. అయితే ఈ కేసులో మానవతా దృక్పథంతో మహిళా సిబ్బందిని వదిలేసినట్లు మీడియాకు వివరించారు.

English summary
At least 15 people, including a senior official of the Brihanmumbai Municipal Corporation (BMC), were arrested following a raid on a dance bar in Colaba at South Mumbai early on Wednesday. During the raid, police arrested nine members of the hotel management staff and six customers, which includes an officer rank of deputy municipal commissioner," an official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X