వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై: ముస్లిం యువతికి ఇల్లు అద్దెకివ్వలేదు, ఫిర్యాదు (వీడియో)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: మతపరమైన వివక్షను సహించేది లేదని ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ప్రకటించినా, తాజాగా ఓ ముస్లిం యువతికి అద్దెకు ఇల్లు ఇవ్వడానికి నిరాకరించిన సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. దీనిని నిరసిస్తూ ఆ యువతి జాతీయ మైనారిటీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

వివరాలిలా ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తోన్న 25 ఏళ్ల మిస్బా ఖాద్రి ఉద్యోగరీత్యా గుజరాత్ నుంచి గతేడాది ముంబైకి వచ్చింది. మరో ఇద్దరు మహిళా ఉద్యోగిణులతో కలిసి ఉండేందుకు నిర్ణయించుకుని, ముంబైలోని వదాలలోని సాంఘ్వి హైట్స్ లోని ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కోసం అపార్ట్ మెంట్ అసోసియేషన్ ను సంప్రదించింది.

 Mumbai: Now, woman denied flat for being Muslim

బ్రోకర్‌కు రూ. 24వేలు చెల్లించి, ఎట్టకేలకు కొత్త ఇంటికి మారేందుకు ఏర్పాటు చేసుకుంది. కొత్త ఇంటికి మారడానికి ఒకరోజు ముందు అపార్ట్‌మెంట్ బిల్డర్ నుంచి వచ్చిన ఫోన్‌కాల్ ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సంభాషణలో ముస్లింలు తమ అపార్ట్ మెంట్‌లో ఉండడానికి కుదరదంటూ హౌసింగ్ సొసైటీ వారు అభ్యంతరం తెలిపినట్లు పేర్కొన్నాడు.

వెంటనే ఖాద్రి బ్రోకర్‌ని సంప్రదించింది. అపార్ట్‌మెంట్‌లో చుట్టుప్రక్కల వారు ఆమెపై ఎలాంటి వేధింపులకు పాల్పడ్డ తమకెలాంటి సంబంధం లేదని హామీ యిస్తూ నో అబ్జెక్షన్ లెటర్ రాసి యివ్వాలని, అలాగే ఆమె వ్యక్తిగత వివరాలతో కూడిన బయోడేటా కావాలని షరతులు విధించారు.

అంతక ముందున్న ప్లాట్ నోటీస్ పిరియడ్ ముగియడంతో చేసేదేమి లేక షరతులతో ఖాద్రి ఇంట్లో చేరారు. మళ్లీ వారం రోజుల తర్వాత బ్రోకర్ ఫోన్ చేసి ఖాద్రి తక్షణమే ఇంటిని ఖాళీ చేయాలనీ, గెంటేస్తామనీ, లేదంటే పోలీసులకు పిలవాల్సి వస్తుందని చెప్పాడు.

దీంతో చేసేదేమి లేక ఆపార్ట్‌మెంట్‌లో ఉన్న బిల్డర్‌ని ఖాద్రీ కలిశారు. తమ అపార్ట్‌మెంట్‌లో ముస్లింలకు ఫ్లాట్ అద్దెకివ్వడానికి రూల్స్ ఒప్పుకోవని తెలిపాడు. 5-6 సంవత్సరాల తర్వాత పరిస్ధితిని సమీక్షించి అప్పుడు ముస్లింలకు ఫ్లాట్ అద్దెకిస్తామని చెప్పినట్లు ఖాద్రీ చెప్పింది.

దీంతో ఉద్యమకర్త షెన్జాద్ పూనావాలా సహాయంతో ఆమె జాతీయ మైనారిటీ కమిషన్‌ను ఆశ్రయించింది. మత వివిక్షను చూపిన అపార్ట్‌మెంట్ బిల్డర్‌పై విచారణకు ఆదేశించాలని కోరింది. కమిషన్ కోసం తనను వేధించిన బ్రోకర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని కోరింది.

English summary
In yet another incident of religious discrimination in Mumbai, a 25-year-old woman was denied flat for being Muslim. Misbah Quadri was allegedly refused a flat by a builder as she belongs to the minority community.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X