వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై హైలర్ట్: సిద్ధి వినాయక ఆలయానికి ఉగ్రముప్పు

|
Google Oneindia TeluguNews

ముంబై: నగరంలోని సిద్ధి వినాయక ఆలయంపై పాకిస్థాన్ ఉగ్రవాద గ్రూపులు దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెప్పడంతో ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు. ఏదేని మంగళవారం ఈ ఆలయం పరిసరాల్లో గుమిగూడిన జన సమూహంపై దాడి చేసే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించడంతో భద్రత కట్టుదిట్టం చేశారు.

అంతేగాక, ముంబై వినాయక ఆలయంతోపాటు దేశంలోని పలు లక్ష్యాలపై జనవరి 28వ తేదీలోగా దాడులు జరిపేందుకు పాకిస్థాన్ చెందిన జమాత్ ఉద్‌దవా, లష్కరే తోయిబా, జైష్ ఏ మొహమ్మద్, హిజ్‌బుల్ ముజాహిద్దీన్ టైస్టు సంస్థలు భారత్‌కు నాలుగు వేర్వేరు బృందాలను పంపించాయంటూ భారత్ ఇంటెలిజెన్స్ బ్యూరో మహారాష్ట్ర పోలీసులతోపాటు ముంబై పోలీసులను అప్రమత్తం చేశాయి.

 Mumbai on high alert after intelligence input about terror attack

గణతంత్ర ఉత్సవాల నేపథ్యంలో మరోసారి ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని భారత నిఘా సంస్థ ఐబీ హెచ్చరించింది. జనవరి నెలాఖరు లోపే విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదు గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించారని పేర్కొంది.

ఉత్తర భారతంలో ఈ దాడులు చేసే అవకాశం ఉందంటూ, అన్ని రాష్ర్టాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మహారాష్ట్ర తోపాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

English summary
Mumbai has been put on high alert after intelligence inputs warning about a terror attack by Pakistan-based jihadi elements targeting Siddhivinayak Temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X