వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దావూద్ మాజీ అనుచరుడు, గ్యాంగ్‌స్టర్ ఇజాజ్ లక్డావాలా అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మాజీ అనుచరుడు, పలు దోపిడీ, హత్యాయత్నం కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇజాజ్ లక్డావాలా అనే గ్యాంగ్ స్టర్‌ను ముంబై పోలీసులు బీహార్ రాజధాని పాట్నాలో అరెస్ట్ చేశారు. దావూద్ ఇబ్రహీంతోపాటు మరో డాన్ చోట రాజన్‌ల ముఠాల్లో పనిచేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇజాజ్ మొత్తం 27 కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్నట్లు చెప్పారు. ఇజాజ్‌పై హత్యాయత్నం, దోపిడీ, దొమ్మి వంటి పలు కేసులు నమోదయ్యాయయిన తెలిపారు. 20 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఇజాజ్‌ను ఎట్టకేలకు పట్టుకున్నారు. గతంలోనే ఇతనిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడం గమనార్హం.

Mumbai Police arrests former Dawood aide Ejaz Lakdawala from Patna

ఇజాజ్ నకిలీ ధృవపత్రాలతో మలేషియా, అమెరికా, నేపాల్, కెనడా దేశాల్లో నివసించినట్లు పోలీసులు వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ 28న నకిలీ దృవ పత్రాలతో దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ఇజాజ్ కుమార్తె సోనియాను ముంబై విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

తాజాగా, సోనియా ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడు పాట్నాలో ఉన్నట్లుగా తెలుసుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడ్ని ముంబై కోర్టులో ప్రవేశపెట్టి జనవరి 21 వరకు కస్టడీకి కోరినట్లు ముంబై దోపిడీ నిరోధక పోలీసులు వెల్లడించారు. దీంతో కోర్టు ఇజాజ్‌ను జనవరి 21 వరకు పోలీస్ కస్టడీకి అప్పించింది. లక్డావాల ముంబై పశ్చిమ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని నేరాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు.

2012 దోపిడీ కేసులో లక్డావాలా కజిన్ సమీర్ లక్డావాలను 2019 ఫిబ్రవరిలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. లక్డావాల నేరాల గురించి సమీర్ చాలా సమాచారం ఇచ్చారని చెప్పారు. నాలుగు దోపిడీ కేసుల్లో నిందితుడైని లక్డావాల సోదరుడు అకీల్ లక్డావాలాను పోలీసులు గత ఏప్రిల్ నెలలో అరెస్ట్ చేశారు. ఇతడిచ్చిన సమాచారంతోనే లక్డావాలా కూతురు సోనియాను అరెస్ట్ చేశారు పోలీసులు. షాహీద్ షేక్‌ను వివాహం చేసుకున్న ఆమె.. తన పేరును షిఫా షేక్‌గా మార్చుకుంది.

ఇజాజ్ లక్డావాల తన మొబైల్‌లో ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ వేసుకున్న కారణంగా అతడ్ని అరెస్ట్ చేయడం ఇంత ఆలస్యమైందని పోలీసులు వెల్లడించారు. ఆ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకుని తను ఉన్న స్థలాన్ని చూపించకుండా వేరే ప్రాంతాన్ని చూపించేలా ఇజాజ్ చేశారని పోలీసులు వెల్లడించారు. కాగా, ఇజాజ్ అరెస్టుతో దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన విషయాలు కూడా వెలుగుచూసే అవకాశం ఉందని తెలుస్తోంది.

English summary
The arrest of Ejaz Lakdawala was a major breakthrough as the police hopes that it could get further information on the activities of his former boss Dawood Ibrahim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X