వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown continue: ‘బాంద్రా’లో కూలీలను రెచ్చగొట్టిన వ్యక్తి అరెస్ట్, ఫేస్‌బుక్‌లో వీడియో..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించడంతో స్వస్ధలాలకు వెళ్లేందుకు బాంద్రాకు పోటెత్తుందుకు కారణమైన కార్మిక నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు మరో వెయ్యి మందిపై కూడా కేసు నమోదు చేశారు. ముంబై నుంచి వలసకూలీలు స్వస్థలాలకు వెళ్లిపోవాలని వినయ్ దూబే అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. వలసకూలీలు కుటుంబాన్ని కలుసుకునేందుకు అవకాశం ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేశారు.

వలసకూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించకుంటే.. తాను కాలినడకన ఉత్తర భారతదేశం వెళతానని వీడియోలో పేర్కొన్నాడు. ముంబై నుంచి వెళ్లకుండా ఉంటే చనిపోతారని.. వెంటనే స్వగ్రామాలకు వెళ్లిపోవాలని సూచించాడు. అంతేకాదు బాంద్రాలో తన టీం ఉంది అని.. అక్కడనుంచి ఉద్యమం ప్రారంభిస్తోందని వినయ్ దూబే తెలిపారు. అతనిని నవీ ముంబై పోలీసులు అదుపులోకి తీసుకొని.. ముంబై పోలీసులకు అప్పగించారు. అతనిపై అజాద్ మైదాన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

 Mumbai Police detains self-proclaimed labour leader vinay..

Recommended Video

India Lockdown : Churches in Across India Remain Shut On Easter

మరోవైపు మంగళవారం జరిగిన ఘటనపై 800 నుంచి వెయ్యి మందిపై బాంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో విద్రోహ చర్య దాగి ఉందా అనే కోణంలో కూడా విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున..లాక్ డౌన్ మే 3వ తేదీ వరకు కొనసాగుతుందని ప్రధాని మోడీ ప్రకటించిన కొద్దీ గంటల్లోనే వేలాదిమంది బాంద్రా రైల్వేస్టేషన్ వద్దకు రావడంతో కలకలం నెలకొన్న సంగతి తెలిసిందే.

English summary
Mumbai Police has detained Vinay Dubey.. who may have potentially set off rumours that led to hundreds of migrants flooding the Bandra West area on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X