• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజ్ కుంద్రా మొబైల్, ల్యాప్‌టాప్ నిండా పోర్న్ క్లిప్స్: 9 కోట్లకు బేరం: బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికా అకౌంట్

|

ముంబై: హిందీ చలన చిత్ర పరిశ్రమలను షేక్ చేస్తోన్న రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ (Raj Kundra Pornography case) కేసులో ముంబై పోలీసులు మరో పురోగతిని సాధించారు. ఈ కేసులో బెయిల్ పొందిన రాజ్ కుంద్రా ఇవ్వాళ విడుదల కావాల్సి ఉంది. బెయిల్ మీద విడుదల కావాల్సిన ఈ పరిస్థితిలో ఈ పోర్నోగ్రఫీ కేసు కీలక మలుపు తిరిగింది. అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు ఓ పిటీషన్‌ను దాఖలు చేశారు.

ఎన్నికల బహిష్కరణ సరే.. పార్టీ ఓట్లు ఏమయ్యాయ్: దిక్కుతోచని స్థితిలో టీడీపీఎన్నికల బహిష్కరణ సరే.. పార్టీ ఓట్లు ఏమయ్యాయ్: దిక్కుతోచని స్థితిలో టీడీపీ

 119 పోర్న్ వీడియోలు

119 పోర్న్ వీడియోలు

ఈ పిటీషన్‌లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పలు కీలక విషయాలను పొందుపరిచారు. అతని మొబైల్ ఫోన్, ల్యాప్‌ట్యాప్, ఇతర హార్డ్ డిస్క్‌లల్లో భారీగా పోర్న్ వీడియోలు ఉన్నట్లు వెల్లడించారు. వాటి గురించి తాము ఆరా తీయాల్సి ఉందని, దర్యాప్తును కొనసాగించాల్సి ఉందని పేర్కొన్నారు. రాజ్ కుంద్రా బెయిల్‌ను రద్దు చేసి, అతణ్ని తమ కస్టడీకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. రాజ్ కుంద్రా మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌, హార్డ్ డిస్కుల్లో 119 పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు ఉన్నాయని పేర్కొన్నారు.

రూ. 9 కోట్లకు బేరం..

రూ. 9 కోట్లకు బేరం..

వాటన్నింటినీ తొమ్మిది కోట్ల రూపాయలకు అమ్మకానికి పెట్టాడని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ధృవీకరించారు. ఇదే విషయాన్ని రాజ్ కుంద్రా బెయిల్ రద్దు పిటీషన్‌లో పొందుపరిచారు. ఈ పరిస్థితుల్లో రాజ్ కుంద్రా బెయిల్ మీద విడుదల కావడం వల్ల సాక్ష్యాధారాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉందని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకొన్ని రోజుల పాటు అతణ్ని తమ కస్టడీలోనే కొనసాగించేలా ఆదేశాలను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆన్‌లైన్ బెట్టింగుల్లో

ఆన్‌లైన్ బెట్టింగుల్లో

ఈ వీడియోలను చిత్రీకరించడానికి రాజ్ కుంద్రా ప్రతి నెలా వేల రూపాయలను ఖర్చు చేసేవాడని పేర్కొన్నారు. అతని ఆడిటర్, ఐటీ డెవలపర్ ఈ విషయాన్ని తెలిపారని వివరించారు. ఆన్‌లైన్ బెట్టింగుల్లోనూ రాజ్ కుంద్రా ప్రమేయం ఉందని, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికాలో అతనికి అకౌంట్స్ ఉన్నాయని గుర్తించినట్లు పేర్కొన్నారు. తొమ్మిది కోట్ల రూపాయలకు ఆ పోర్న్ వీడియోలను బేరం పెట్టిన విషయం.. అతని వాట్సప్ చాట్‌ పరిశీలనలో తేలిందని పోలీసులు స్పష్టం చేశారు.

50 వేల రూపాయల పూచికత్తుతో

50 వేల రూపాయల పూచికత్తుతో

ఈ వీడియోలు ఇప్పటికే - అమ్మేశాడా? లేదా? అనేది ఇంకా తేలాల్సి ఉందని చెప్పారు. ఇంకొన్ని రోజుల పాటు రాజ్ కుంద్రాను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. ముంబై మెజిస్ట్రేట్ న్యాయస్థానం.. రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 50 వేల రూపాయల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. ఇదే పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా వ్యాపార భాగస్వామి ర్యాన్ థోర్పేకు సైతం బెయిల్ లభించింది. ఇవ్వాళ రాజ్ కుంద్రా, ర్యాన్ థోర్పే జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది.

    Allu Arjun Changes Hotel Owner's Fate || Oneindia Telugu
    న్యాయస్థానం స్పందిస్తుందా?

    న్యాయస్థానం స్పందిస్తుందా?

    అదే సమయంలో- ఈ కేసును విచారిస్తోన్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.. బెయిల్ రద్దు వ్యవహారం మరో మలుపు తిరిగింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విజ్ఞప్తికి న్యాయస్థానం సానుకూలంగా స్పందిస్తుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. కాగా- రాజ్ కుంద్రాకు బెయిల్ లభించడం పట్ల అతని కుమారుడు వియాన్ స్పందించాడు. గణపతి బొప్పా మోరియా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

    English summary
    During the investigation police found 119 porn videos from businessman Raj Kundra's mobile, laptop, and a hardrive disk. He was planning to sell these videos for Rs 9 crores: Mumbai Police Crime Branch.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X