వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శెభాష్ ప్రకాశ్ : సెల్యూట్ చేసిన సోషల్ మీడియా.. ఎందుకో తెలుసా ..!!

|
Google Oneindia TeluguNews

ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వరద ప్రవాహం కొనసాగింది. ఇటీవల కురిసిన వర్షాలతో ఎటుచూసినా నిండుకుండలా కనిపించింది. అయితే వరదలతో చిక్కుకున్న వారిని కాపాడి హీరోలుగా నిలుస్తున్నారు. ఇటీవల ఓ విదేశీ వనితను ముంబైకర్లు కాపాడిన సంగతి తెలిసిందే. ఆ ఫోటో సోషల్ మీడియాలో కూడా వైరలైంది.

శెభాష్ ప్రకాశ్ ..
ముంబైకి చెందిన పోలీసు కానిస్టేబుల్ ప్రకాశ్ రావర్ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వరదలతో అప్రమత్తంగానే ఉన్నారు. ఈ క్రమంలో ఓ శునకం వరదలతో బెంబేలెత్తిపోయింది. దానిని చూసిన ప్రకాశ్ వెంటనే కాపాడారు. ప్రకాశ్ విధి నిర్వహణను ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియోకు తెగ లైకులు వస్తున్నాయి. ప్రకాశ్ చేసిన పనిని శెభాష్ అంటూ కొనియాడుతున్నారు.

Mumbai Police officer saves dog from drowning during floods. Big salute, says Internet

బెస్ట్ ఫ్రెండ్స్ ...
తన నిజమైన స్నేహితుడిని మనిషి కాపాడాడు, ఫ్రెండ్ ఇన్‌డిడ్ అనే పేరుతో ముంబై పోలీస్ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో ట్విట్టర్‌లో తెగ ట్రోలవుతుంది. ప్రకాశ్ ధైర్య సాహసాలకు ఫిదా అయ్యామని చాలా మంది కామెంట్లు రాశారు. ఈ వీడియో ఉన్న ట్వీట్‌కు 3 వేల 500 మంది రీ ట్వీట్ చేశారు. 18 వేల లైకులు వచ్చాయి. చాలామంది ప్రకాశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సినీనటుడు రితేశ్ దేశ్‌ముఖ్ కూడా ప్రకాశ్‌ వీడియో ట్వీట్‌కు స్పందించారు. మీరు పోలీసు విభాగంలో ఉన్నందుకు గర్విస్తున్నామని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. అంతేకాదు శునకాలతో మనుషులకు ఉన్న అవినాభవ సంబంధం మరోసారి రుజువైందని ట్వీట్ చేశారు. గత కొన్నిరోజులుగా కురుస్తోన్న వర్షాలతో ముంబై జనజీవనం స్తంభించిన సంగతి తెలిసిందే.

English summary
as Mumbai battled torrential rains over the past few days, video clips and information about several incidents in the city flooded Twitter. On Wednesday, Mumbai Police released a video of a police officer rescuing a dog from the floods following heavy rainfall and the internet is overjoyed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X