వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభిమానితో సెల్ఫీ: చిక్కుల్లో పడ్డ వరుణ్ ధావన్, ముంబై పోలీసులకు క్షమాపణ

ఇటీవల వరుణ్ ధావన్ తన కారులో వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ లో చిక్కుకున్నాడు. అతని కారు పక్కనే మరో ఆటో వచ్చి ఆగింది. ఆటోలో ఉన్న యువతి వరుణ్ ను గుర్తుపట్టి.. 'నేను మీకు పెద్ద ఫ్యాన్.. ప్లీజ్ ఒక్క సెల్ఫీ'

|
Google Oneindia TeluguNews

Recommended Video

Police Issue E-Challan to Hero For This Selfie | Oneindia Telugu

ముంబై: రోడ్డుపై వెళ్తున్నప్పుడు సడెన్‌గా సెలబ్రిటీ ఎవరైనా కనిపించారనుకోండి.. అభిమానులు వారి వెంటపడి సెల్ఫీలు కోరడం ఈరోజుల్లో అత్యంత సహజం.

అయితే తాము ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూసుకుని మెదలాల్సిన బాధ్యత సెలబ్రిటీలపై ఉంటుంది. దాన్ని విస్మరిస్తే ఆ తర్వాత చెడ్డ పేరు వచ్చేది వారికే.

తాజాగా ముంబై రోడ్డుపై ఓ అభిమానితో సెల్ఫీ దిగిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చిక్కుల్లో పడ్డాడు. అతని తీరుపై ముంబై పోలీస్ యంత్రాంగం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు వరుణ్ కూడా పోలీసుల ధర్మాగ్రహం పట్ల సానుకూలంగానే స్పందించి క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

ఇంతకీ అసలు విషయమేంటంటే.. ఇటీవల వరుణ్ ధావన్ తన కారులో వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ లో చిక్కుకున్నాడు. అతని కారు పక్కనే మరో ఆటో వచ్చి ఆగింది. ఆటోలో ఉన్న యువతి వరుణ్ ను గుర్తుపట్టి.. 'నేను మీకు పెద్ద ఫ్యాన్.. ప్లీజ్ ఒక్క సెల్ఫీ' అంటూ రిక్వెస్ట్ చేసింది. అభిమాని కోరిక కాదనలేక.. కారులోంచే తల బయటకు పెట్టి మరీ ఆమెతో సెల్ఫీ దిగాడు వరుణ్.

మరుసటి రోజు దినపత్రికల్లో ఈ వార్త ప్రధానంగా కనిపించడంతో పోలీస్ శాఖ దీనిని సీరియస్ గా తీసుకుంది. ట్విట్టర్ ద్వారా వరుణ్ ను హెచ్చరించింది.
'ఇలాంటి స్టంట్స్ సినిమాల్లో చేస్తే ఫర్వాలేదు కానీ ఇలా ముంబై రోడ్లపై చేయడం సరికాదు. ఇలాంటి చర్యల వల్ల నీతో పాటు మరికొందరి ప్రాణాలను రిస్క్ లోకి నెట్టేసే ఆస్కారం ఉంది. బాధ్యత గల ముంబై పౌరుడిగా.. ఓ యూత్‌ ఐకాన్‌గా నీ నుంచి మేం ఇలాంటిది కోరుకోవటం లేదు. ఇందుకు శిక్షగా మీకు ఈ-ఛలాన్‌ పంపుతున్నాం. మరోసారి ఇలాంటి పని చేస్తే కఠిన శిక్షనే ఎదుర్కోవాల్సి ఉంటుంది' అని ముంబై పోలీస్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

పోలీసుల ఆగ్రహంతో వరుణ్ ధావణ్ క్షమాపణలు తెలియజేశాడు. అభిమాని కోరికను తిరస్కరించలేకనే అలా సెల్ఫీ దిగాల్సి వచ్చిందని, భద్రతా సూత్రాలను ఇక నుంచి తప్పక పాటిస్తానని, మరోసారి ఇలాంటివి రిపీట్ చేయనని ట్విట్టర్ ద్వారా బదులిచ్చాడు.

English summary
When you have millions of fans admiring you, there are people who also expect you to behave responsibly in the public. This is a lesson Varun Dhawan would have learnt in a not so pleasing way recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X