వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పబ్ ప్రమాదం: రియల్ హీరో, మూడుసార్లు ఏడంతస్తులు ఎక్కి కాపాడాడు

|
Google Oneindia TeluguNews

ముంబై: ఇటీవల ముంబైలో పబ్బులో జరిగిన ప్రమాదంలో 14 మంది చనిపోయారు. మరో యాభై అయిదు మంది గాయపడ్డారు. అయితే ఓ పోలీస్ అధికారి మాత్రం పలువురిని కాపాడారు. అది కూడా ఏడంతస్తులు పైకి పలుమార్లు ఎక్కి బాధితులను కాపాడారు.

సదరు పోలీస్ అధికారి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోలీస్‌ అధికారి పేరు సుదర్శన్‌ షిండే. ప్రమాదం జరిగిన సమయంలో సంఘటన స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బందిలో ఆయన ఒకరు.

Mumbai Pub Fire: Real Hero saved 3 Lives!

మత్తు..సెల్ఫీలు.. నిర్లక్ష్యం: ముంబై 1 అబవ్ పబ్‌లో దారుణానికి కారణాలు ఇవే!మత్తు..సెల్ఫీలు.. నిర్లక్ష్యం: ముంబై 1 అబవ్ పబ్‌లో దారుణానికి కారణాలు ఇవే!

కమల మిల్స్‌ కాంపెక్స్‌లోని ఏడు అంతస్తుల్లో భారీగా మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు వ్యాపిస్తున్నా మహిళల అరుపులు విని సుదర్శన్‌ వారిని కాపాడేందుకు సాహసం చేశారు.

మూడుసార్లు ఏడు అంతస్తులు ఎక్కి గాయపడ్డ ముగ్గురిని తన భుజాలపై ఎక్కించుకొని కిందకు వచ్చారు. వారినికాపాడారు.

తాను మూడో అంతస్తుకి వెళ్లగానే అక్కడ అంతా కాలిపోయి ఉందని, ఎవ్వరూ లేరనుకుని కిందికి వస్తుండగా ఓ మహిళ అరుపులు వినిపించాయని, వెంటనే ఆమెను ఎత్తుకుని బయటికి తీసుకెళ్లానని, పబ్‌ కావడంతో ఎక్కడ చూసినా హుక్కా, మద్యం సీసాలే ఉన్నాయని, దాంతో మంటలు మరింత వేగంగా వ్యాపించాయని, పొగ భరించలేక కొట్టుమిట్టాడుతున్న మరో ఇద్దరిని కూడా ఇలాగే కాపాడానని అతను తెలిపారు.

English summary
About 14 People were killed and 55 others suffered injuries due the fire mishap at 'One Above' restaurant in Kamala Mills Complex, Mumbai. Most of the deceased were the guests who attended a Young Woman's Birthday Bash. Structures made of wooden and fibre allowed the fire to spread faster. Lack of separate Emergency Exit complicated the situation. The terrace engulfed in flames within a flash.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X