వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇళ్ళ నుండి ప్రజలు బయటకు రాకూడదు:సీఎం

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబై మహనగరంలో భారీ వర్షాలతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ముంబై వాసులు కష్టాలు పడుతున్నారు.

ప్రధానమార్గాల్లో ట్రాఫిక్ స్ధంబించడంతో వాహనదారులు ఇక్కట్లపాలయ్యారు. దాదర్, చెంబూర్, సైన్, వర్లీ, లోయర్ పరేల్ సహ పలు ప్రాంతాలు నీట మునిగాయి.

Mumbai rains: Mumbaikars, here are all the helplines you need

రైళ్ళు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. పలు లోకల్ రైళ్ళు రద్దయ్యాయి. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెలుతురు మందగించడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది.

మరో 48 గంటలపాటు భారీవర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.దీంతో మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్ష నిర్వహించారు.

అత్యవసర పనులుంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కోరారు. ట్రాఫిక్ సలహలు పాటించాలని, ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకొంటే పోలీసులకు ఫోన్ చేయాలని సూచించారు.

ట్విట్టర్ ద్వారా సమాచారాన్ని అందించిన అధికారులు స్పందిస్తారని సీఎం చెప్పారు. సహయం కావాల్సిన వారు 100 నెంబర్‌కు ఫోన్ చేయాలని ముంబై పోలీసులు ట్వీట్ చేశారు.

ముంబై పోలీస్ వైర్‌లెస్ నెంబర్. 22633319, బీఎంసీ హెల్ప్‌లైన్ 1918, బీఎంసీ ల్యాండ్‌లైన్ 22694719. సివిల్ డిఫెన్స్ కోసం 22856435, ట్రాఫిక్‌ హెల్ప్ లైన్ కోసం 8454999999, ఎంసీజీఎం హెల్ప్‌లైన్ కోసం 022 22694725 నెంబర్లకు ఫోన్ చేయాలని సీఎం కోరారు.

English summary
In the coming hours, Mumbai could receive showers similar to those that brought the city to its knees in 2005, the weatherman says. Mumbaikars, here are some helpline numbers that could be of great use to you.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X