• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సెల్యూట్ టు ముంబై పోలీస్: నాలుగు రోజుల్లో ఒక్కరూ డుమ్మా కొట్టలేదట!

|

ముంబై: ముంబైలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. నాలుగు రోజులుగా ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షానికి మునకేసిందా మహానగరం. జనజీవనం పడకేసింది. ఇంట్లో నుంచి అడుగు బయటికి పెట్టలేని పరిస్థితి నెలకొంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాలు వర్షపు నీటితో మోకాలిలోతు మునిగి తేలుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలకు సెలవులకు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు మూత పడ్డాయి. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. లోకల్ రైళ్లు డిపోలకే పరిమితం అయ్యాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ముంబై పోలీసులు విధులను నిర్వర్తిస్తున్నారు.

సోనియా మార్క్ పాలిటిక్స్: జనంలోకి కాంగ్రెస్..దేశవ్యాప్తంగా పాదయాత్రలు!

వర్షపు నీటి కారణంగా రోడ్లపై స్తంభించిపోయిన వాహనాల రాకపోకలను నియంత్రించడంలో వెనుకాడట్లేదు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయట్లేదు ముంబై ట్రాఫిక్ విభాగం పోలీసులు. వర్షానికి తడవకుండా జర్కిన్లను ధరించి, విధుల్లో పాల్గొంటున్నారు. ముంబైలో భారీ వర్షాలు ఆరంభమైనప్పటి నుంచీ ఏ ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా విధులకు గైర్హాజరు కాలేదని, ఎప్పట్లాగే విధులను నిర్వర్తిస్తున్నారని ముంబై మహా నగర ట్రాఫిక్ విభాగం అధికారులు వెల్లడించారు. నగరం వ్యాప్తంగా మోహరింపజేసిన జాతీయ విపత్తుల నిర్వహణ బలగాలకు సహాయ, సహకారాలను సైతం అందజేస్తున్నారని అన్నారు.

Mumbai rains stop life in the city for all but traffic cops. Internet hails the heroes

ముంబై రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీటిని తొలగించడంలో స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించడానికీ ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వెనుకాడట్లేదని, రోడ్లపై కొట్టుకు వచ్చిన చెత్తా, చెదారాన్ని తొలగిస్తూ వాహనాల రాకపోకలు సజావుగా సాగడానికి నిరంతరం కృషి చేస్తున్నారని ముంబై ట్రాఫిక్ పోలీస్ విభాగం అధికారులు తెలిపారు. ముంబై రోడ్లపై నిదాదాపు అయిదడగుల మేర వర్షపు నీరు నిలిచిన కుర్లాలోని బైల్ బజార్, క్రాంతినగర్ నుంచి 1300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతానికి ఆనుకుని ప్రవహించే మిట్టీ నదిలో ఎప్పుడూ లేనివిధంగా వరద నీరు ప్రవహిస్తోంది.

ముంబై ట్రాఫిక్ పోలీసుల సేవలను నెటిజన్లు, ట్విట్టరెటీలు ప్రశంసిస్తున్నారు. నాలాసపోరా ప్రాంతంలో భారీ వర్షంలో విధులను నిర్వర్తిస్తోన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫొటోను ఓ ట్విట్టరెట్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ గా మారింది. దాదాపు అయిదడగుల మేర వర్షపు నీరు నిలిచిన కుర్లాలోని బైల్ బజార్, క్రాంతినగర్ నుంచి 1300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతానికి ఆనుకుని ప్రవహించే మిట్టీ నదిలో ఎప్పుడూ లేనివిధంగా వరద నీరు ప్రవహిస్తోంది. అసలు ఇక్కడ ఇలాంటి నది ఒకటుందనే విషయాన్ని ఎప్పుడో మరచేపోయామని, అలాంటి నది ఇప్పుడు వరద ప్రవాహంతో పొంగిపోర్లుతోందని స్థానికులు చెబుతున్నారు. సమీపంలోని సియోన్ రైల్వేస్టేషన్ పూర్తిగా నీటిలో మునిగింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Heavy rains taking over Mumbai, schools and colleges have been shut, local railway routes have been closed, but there is one set of people who are still winning over the rains and doing their jobs. A recent image of a traffic police constable in Mumbai wearing a raincoat and standing on the road amid a heavy downpour has been going viral and for all the right reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more