వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇల్లు లాంటి ఆటో.. హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా ఫిదా.. సోషల్ మీడియాలో హల్‌చల్

|
Google Oneindia TeluguNews

Recommended Video

This Auto Driver Runs 'Mumbai’s First Home System Auto-Rickshaw' In City

పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అని పెద్దలు ఊరికే అనలేదు. తాము చేసే పనుల్లో కొందరు వైవిద్యత చాటుతుంటారు. అందరిలా కాక డిఫరెంట్‌గా ఆలోచించి వార్తల్లో నిలుస్తారు. ముంబైకి చెందిన సత్యావాన్ గితే కూడా అలాంటి కోవకు చెందుతారు. ఆటో నడిపే సత్యవాన్ ఏం చేశాడో తెలుసుకోవాలనుందా..? అయితే ఈ స్టోరీ చదవండి.

 వినూత్న ఆలోచన

వినూత్న ఆలోచన

ముంబైకి చెందిన సత్యవాన్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అందరిలా కాకుండా వైవిద్యం ఏదైనా చేయాలని అనుకున్నాడు. తన ఆటో రూపురేఖలను మార్చివేశాడు. ఇదీ ఆటోనా లేదా ఇల్లు అనే అనుమానం కలుగుతుంది. ఆటోలో ప్రయాణిస్తున్న వారికి ఇంట్లో ఉన్న ఫీల్ కలిగించేలా ఏర్పాట్లు చేశారు.

మంచి నీరు..

మంచి నీరు..

ఆటోలో ప్రయాణిస్తుంటే ప్యాసెంజర్స్‌కు దాహం వేస్తోంది. అందుకోసం నీళ్లను ఏర్పాటుచేశారు. కొందరు టిఫిన్ చేశాక.. చేతులు కడుక్కునేందుకు వాష్ బేషిన్ కూడా ఆమర్చారు. దీంతో పిల్లలు ఉంటే వాహనం పక్కకు ఆపాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రయాణిస్తూనే తమ అల్పహారం పూర్తి చేసే వెసులుబాటు కల్పించారు.

డెస్క్‌టాప్..

డెస్క్‌టాప్..

దీంతోపాటు పక్కన కంప్యూటర్ డెస్క్‌టాప్ మానిటర్ కూడా ఉంది. అవసరం ఉన్నవారు ఏమైనా బ్రౌజ్ చేసుకొనే వీలుంటుంది. ప్రయాణిస్తున్న సమయంలో కొందరు మొబైల్స్ చార్జింగ్ అయిపోతుంటుంది. అలాంటి సమయంలో అత్యవసరంగా ఫోన్లు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం చార్జింగ్ సాకెట్ కూడా అందుబాటులో ఉంచారు. దీంతో ప్యాసెంజర్స్ తమ మొబైల్స్ చార్జ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

కాసిన్ని మొక్కలు

కాసిన్ని మొక్కలు

పర్యావరణానికి హాని కలిగించే చార్జింగ్, డెస్క్ టాప్ ఏర్పాటుచేసిన సత్యవాన్.. దానిని నివారించేందుకు ఇతోధికంగా మొక్కలు కూడా పెంచుతున్నారు. ఒకవైపు దిగే చోట భారీ మొక్కలు ఉంచి ప్రయాణికులు తాము ఇంట్లోనే ఉన్నామా అనే ఫీలింగ్ కలిగిస్తున్నారు. ముంబై రహదారుల్లో తిరుగుతున్న సత్యవాన్ ఆటో అలా అందరికీ తెలిసిపోయింది. ఒక్కొక్కరూ సత్యవాన్‌ చూపిన చొరవను ప్రసంశిస్తున్నారు.

ట్వింకిల్ ఫిదా


సత్యవాన్ ఆటోను చూసిన ప్రముఖ నటి ట్వింకిల్ ఖన్నా ఆశ్చర్యపోయారు. ఆటోలో ఇన్ని సౌకర్యాలా అంటూ సంబరపడిపడిపోయారు. ఇది ఆటోనా లేదా ఇల్లా అని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆటోకు సంబంధించి సోషల్ మీడియాలో వైరలవడంతో నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు.

స్పెషల్..

స్పెషల్..


సత్యవాన్ ఆటో ప్రత్యేకం అని ప్రయాణికులు కొనియాడుతున్నారు. ఆటోలు ఇన్ని సౌకర్యాలు కల్పించడం విశేషం. ప్రయాణిస్తున్న సమయంలో తాను మంచి ఫీలింగ్ కలిగిందని చెప్పారు. ఇంకొందరు ఆటో సేవలను వినియోగించుకుంటామని కామెంట్ చేశారు. చాలా మంది సత్యవాన్ చొరవను అభినందిస్తున్నారు.

సీనియర్ సిటిజన్స్‌కు ఫ్రీ..

సీనియర్ సిటిజన్స్‌కు ఫ్రీ..

ఆటోలో చార్జింగ్ పెట్టుకోవాలని, పరిశుభ్రమైన నీరు అందిస్తానని సత్యవాన్ చెప్తున్నారు. వృద్ధులను ఒక కిలోమీటర్ వరకు ఉచితంగా తీసుకెళ్తానని ప్రకటించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో ఆటోలో వసతులు ఏర్పాటుచేసినట్టు వివరించారు.

ఆశ్చర్యం..

ఆశ్చర్యం..

తన ఆటో గురించి ట్వింకిల్ ఖన్నా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేయడంపై సత్యవాన్ స్పందించారు. ట్వింకిల్ తన ఆటోను షేర్ చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ట్వింకిల్‌తోపాటు అక్షయ్ తనను మెచ్చుకోవడం సత్యవాన్ ఆనందానికి అవధి లేకుండా పోయింది. త్వరలోనే అక్షయ్ దంపతులను కలుస్తానని సత్యవాన్ పేర్కొన్నారు.

English summary
auto rickshaw driver in Mumbai came up with a unique idea. Satyawan Gite equipped his vehicle with several basic facilities and turned it into the ‘first home system’ auto rickshaw
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X