వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో పార్కింగ్ జోన్‌లో వాహనం నిలిపితే 15 వేల నుంచి 23 వేల రూపాయలు ఫైన్

|
Google Oneindia TeluguNews

ముంబై: ఆదివారం నుంచి అక్కడ రాంగ్ పార్కింగ్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. వాహనం అనుమతిలేని చోట పార్కింగ్ చేస్తే రూ.5వేల నుంచి రూ.23 వేల వరకు భారీ జరిమానా కట్టాల్సిందే. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఇంతకీ ఈ ట్రాఫిక్ నిబంధన ఎక్కడో తెలుసా...?

Recommended Video

నేడు రాజ్భవన్ రోడ్ లో ట్రాఫిక్ ఆంక్షలు
ముంబైలో ట్రాఫిక్ కష్టాలు

ముంబైలో ట్రాఫిక్ కష్టాలు

ముంబై మహానగరంలో ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం నగరాన్ని వర్షాలు ముంచెత్తుతుండంటంతో ఈ సమస్య మరింత ఎక్కువైంది. దీంతో నగర ట్రాఫిక్ పోలీస్ శాఖ కఠిన నిబంధనలు అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. నోపార్కింగ్ జోన్లలో వాహనాలు పార్క్ చేస్తే వారిపై రూ.5వేల నుంచి రూ.23 వేలు జరిమానా విధించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది ఎప్పుడో అనుకుంటే పొరపాటే. ఈ నిబంధన ఆదివారం నుంచి అమల్లోకి రానుంది. అంటే జూలై 7వ తేదీనుంచే అమల్లోకి రానుంది.

నోపార్కింగ్ జోన్‌లో వాహనం నిలిపితే భారీ జరిమానా

నోపార్కింగ్ జోన్‌లో వాహనం నిలిపితే భారీ జరిమానా


నో పార్కింగ్ ఉన్న చోట ద్విచక్ర వాహనాలు పార్క్ చేస్తే రూ. 5వేల నుంచి రూ.8300 వరకు జరిమానా విధించడం జరుగుతుందని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. అదే భారీ వాహనాలు అంటే నాలుగు చక్రాల వాహనాలను నో పార్కింగ్ జోన్‌లో పార్కింగ్ చేస్తే రూ. 15వేలు నుంచి రూ. 23250 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ముంబైలోని ప్రధాన కూడళ్లలో పోస్టర్లు అంటించింది ముంబై ట్రాఫిక్ శాఖ. జరిమానా విధించాకా నిర్ణీత సమయంలో డబ్బులు చెల్లించకపోతే అది పెరుగుతూ పోతుందని ట్రాఫిక్ శాఖ వెల్లడించింది.

 కొత్త నిబంధనలతో తగ్గనున్న ట్రాఫిక్ సమస్య

కొత్త నిబంధనలతో తగ్గనున్న ట్రాఫిక్ సమస్య


ఇదిలా ఉంటే ముంబైలో అన్నిరకాల వాహనాలు దాదాపు 3 మిలియన్‌ వరకు ఉన్నాయి.ట్రాఫిక్‌ సమస్యలకు చెక్ పెట్టేందుకు బాంబే మున్సిపల్ కార్పోరేషన్ ఎక్స్‌సర్వీస్‌మెన్ సేవలను, ఇతర ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సహకారం కూడా కోరనుంది. తొలిగా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్న అత్యంత రద్దీ ప్రాంతాల్లో నిబంధనలను అమలు చేయనున్నామని ట్రాఫిక్ శాఖ తెలిపింది. క్రమంగా ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేస్తామని చెప్పింది ట్రాఫిక్ శాఖ. ఈ కఠిన నిబంధనలతో చాలావరకు ట్రాఫిక్ సమస్యలు నియంత్రణలోకి వస్తాయని భావిస్తోంది బాంబే మున్సిపల్ కార్పోరేషన్.

English summary
Parking will get more difficult than driving from Sunday after the BrihanMumbai Municipal Corporation (BMC) and Mumbai Traffic Police implement new rules for vehicles parked in no-parking zones with fines ranging from Rs 5,000 to Rs 23,000.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X