వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైలో భారీ వర్షాలు: స్తంభించిన జనజీవనం, ఆరెంజ్ అలర్ట్ జారీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో మంగళవారం మరోసారి భారీ వర్షం కురిసింది. ముంబైతోపాటు థానే, నేవీ ముంబై ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వరద నీటితో నిండిన సరస్సులు..

వరద నీటితో నిండిన సరస్సులు..

శాంతాక్రాజ్ ప్రాంతంలో 131.4 మిల్లిమీటర్లు, కొలబాలో 80 మిల్లిమీటర్లు, అలీబాగ్‌లో 133 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబైలోని తాన్సా, తులసీ, మొదక్ సాగర్, విహార్ సరస్సులు వరదనీటితో నిండిపోయాయి.

ఎటూ వెళ్లలేని పరిస్థితి..

ఎటూ వెళ్లలేని పరిస్థితి..

మంగళవారం కురిసిన భారీ వర్షం బుధవారం లేచిన నగరవాసికి షాకిచ్చింది. రోడ్లన్నీ జలమయం కావడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో వివిధ పనులు, కార్యాలయాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

టేక్ కేర్ ముంబై..

టేక్ కేర్ ముంబై..

బుధవారం, గురువారం కూడా ముంబై, పుణె నగరాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ అధికారులు సూచించారు. ఏదైనా అవసరం ఉంటే 100 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. టేక్ కేర్ ముంబై అంటూ ట్వీట్ చేశారు ముంబై పోలీసులు.

ఆరెంజ్ అలర్ట్ జారీ..

పాల్ఘర్, రాయిగడ్, రత్నగిరి, సింధుధుర్గ్ ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. రోజువారీ జీవితాన్ని ఇబ్బందులకు గురిచేసేలా వాతావరణ ఉండే అవకాశం ఉంటే మాత్రమే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేస్తుంది.

English summary
People in Mumbai woke up to a rainy morning this morning with water-logging being reported in some parts of the city. Areas like Sion, Parel, Dadar and Byculla received heavy rain in the wee hours today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X