వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్ వేళ నయా మోసం.. ఆ యువతికి ఊహించని షాక్.. తస్మాత్ జాగ్రత్త..

|
Google Oneindia TeluguNews

కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా కంపెనీలు మూతపడ్డాయి. ప్రైవేట్ సెక్టార్‌లో ఎక్కువ శాతం ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రొడక్షన్,అమ్మకాలు నిలిచిపోవడంతో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వడం లేదు. దీంతో ఆన్‌లైన్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా దొరకుతాయేమోనని కొంతమంది ఆశగా సెర్చ్ చేస్తున్నారు. అయితే ఇదే అదనుగా కొంతమంది సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ముంబైలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

ఆన్‌లైన్ జాబ్ కోసం సెర్చ్..

ఆన్‌లైన్ జాబ్ కోసం సెర్చ్..


ముంబైలోని పొవై ప్రాంతానికి చెందిన అస్మా పఠాన్ (23) అనే యువతి ఘట్కోపర్‌లోని ఓ కంపెనీలో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేసేది. అయితే మార్చి 24 నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఆమె పనిచేస్తున్న కంపెనీ మూతపడింది. అప్పటినుంచి వారికి వేతనాలు కూడా ఇవ్వట్లేదు. దీంతో ఇంట్లో ఖాళీగా ఉన్న అస్మా.. ఖర్చుల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఏదైనా చేయాలనుకుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసింది.

ఇలా మోసపోయింది..

ఇలా మోసపోయింది..

ఈ నెల 16న ఆన్‌లైన్ జాబ్స్ కోసం సోషల్ మీడియా సైట్స్‌లో సెర్చ్ చేస్తుండగా.. రాహుల్ అహుజా అనే వ్యక్తి సోషల్ మీడియా పేజీలో ఓ జాబ్ కనిపించింది. దాని గురించి రాహుల్‌ను సంప్రదించగా.. మొదట రూ.2వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పాడు. దీంతో ఆ డబ్బును పేటీఎం ద్వారా చెల్లించింది. ఆ తర్వాత వెరిఫికేషన్ కోసం మరో రూ.6వేలు చెల్లించాలని చెప్పాడు. ఆ డబ్బు కూడా డిజిటల్ యాప్ ద్వారా చెల్లించింది. అయితే ఫైనల్ వెరిఫికేషన్ పేరుతో రాహుల్ మరోసారి రూ.10వేలు అడిగాడు. అస్మాకి అనుమానం వచ్చినప్పటికీ.. మీరు ఒక్కసారి జాబ్‌లో జాయిన్ అయ్యారంటే.. చాలా సంపాదించుకోవచ్చు అని మభ్య పెట్టాడు. నిజమేనని నమ్మి అడిగిన మొత్తాన్ని ఆమె చెల్లించింది.

Recommended Video

హీరో శివాజీ అరెస్ట్.. విదేశాలకు పారిపోతుండగా అదుపులోకి || Hyderabad Police Arrests Hero Sivaji
తస్మాత్ జాగ్రత్త..

తస్మాత్ జాగ్రత్త..

ఇక ఆ తర్వాతి నుంచి రాహుల్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లాభం లేకపోయింది. అస్మా నంబర్‌ను అతను బ్లాక్ లిస్టులో పెట్టేశాడు. దీంతో ఏం చేయాలో తెలియక స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌తో పాటు పలు కేసులు మోదు చేశారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని చెప్పారు. అయితే ఇలాంటి మోసగాళ్ల చేతికి చిక్కి మోసపోవద్దని.. కాస్త అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు.

English summary
A23-year-old woman from Ghatkopar fell victim to cyber fraud,while reportedly looking for online opportunities for workfrom home. Cops are worried about this new modus operandi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X