వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పగలు స్కూల్‌.. రాత్రి హోటల్‌!? అవాక్కయిన ఉపముఖ్యమంత్రి!

దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయో తనిఖీ చేసేందుకు వెళ్లిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా .. ఓ పాఠశాలలోని దృశ్యాలను చూసి అవాక్కయ్యారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయో తనిఖీ చేసేందుకు వెళ్లిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా .. ఓ పాఠశాలలోని దృశ్యాలను చూసి అవాక్కయ్యారు.

గురువారం రాత్రి కళ్యాణ్‌పురిలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్కూల్‌ను సందర్శించిన సిసోడియా తరగతి గదిలో ఓ జంట ఉండటం చూసి విస్తుపోయారు. వారు ఏకంగా తరగతి గదిలోనే వంటా వార్పూలో మునిగిపోవడంతో మంత్రితో పాటు పోలీస్‌ అధికారులు, ఇతరులు కూడా ఆశ్చర్యపోయారు.

Municipal Corporation of Delhi school rented out at night, two arrested: Manish Sisodia

ఆ గదిలో ఇంకా గ్యాస్‌ సిలిండర్‌, కార్పెంటర్‌ పరికరాలతో గూడిన బ్యాగ్‌ కనిపించాయి. అసలేమిటిదంతా అంటూ ఉపముఖ్యమంత్రి ఆరా తీయగా.. స్కూల్‌ వాచ్ మన్ తమ బంధువులకు తరగతి గదిని అద్దెకు ఇచ్చినట్లు వెల్లడయింది.

మూడు నెలలుగా ఈ తంతు జరుగుతోందని తెలిసి మనీష్ సిసోడియా కంగు తిన్నారు. ఈ విషయం స్కూల్‌ ప్రిన్పిపల్‌కూ తెలుసని స్కూల్‌ వాచ్ మన్ చెప్పడం గమనార్హం. అధికారులు ఆ ఇద్దరిని అరెస్టు చేశారు. అనంతరం స్కూల్‌ నిర్వాకాన్ని ఉప ముఖ్యమంత్రి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి.. ఇలాంటి ఘటనలను ఏ మాత్రం సహించబోమని హెచ్చరించారు.

English summary
Delhi Education Minister Manish Sisodia said that they have raided a Municipal Corporation of Delhi (MCD) school in the city on Thursday night, which used to be rented after school hours. He said that two people have been arrested for renting out the classroom of the school in Kalyanpuri area. The three MCDs in Delhi are run by the BJP. "MCD school guard gave classroom for rent at night. Raided at 10 in the night, two people have been arrested," the minister tweeted late in the night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X