వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగులను కొట్టి, నా పై మర్డర్ కేసు పెట్టాలని శివసేన ఎంపి సవాల్

శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా ఉద్యోగినిపై అమానుషంగా ప్రవర్తించాడు.చెప్పుతో దాడి చేయడమే కాకుండా, తనపై కేసు హత్య కేసు పెట్టుకోవాలని ఆయన సవాల్ విసిరారు.ఈ ఘటనపై ఎయిరిండియా ఎంపిపై కేసు పెట్టింద

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా ఉద్యోగినిపై అమానుషంగా ప్రవర్తించాడు.చెప్పుతో దాడి చేయడమే కాకుండా, తనపై కేసు హత్య కేసు పెట్టుకోవాలని ఆయన సవాల్ విసిరారు.ఈ ఘటనపై ఎయిరిండియా ఎంపిపై కేసు పెట్టింది.

గురువారం నాడు న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా మహిళా సిబ్బందిపై తన చెప్పుతో దాడి చేశారు. అంతే కాదు దారుణమైన బాషను ఉపయోగించారు.అయితే ఎంపిగా ఉంటూ ఈ రకంగా వ్యవహరించకూడదంటూ ఆమో ఆయనను వారించినా ఆయన మాత్రం వినలేదు.

Murder case okay, I have many cases against me', Sena MP told stewardess

ఎంపి రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా మహిళా ఉద్యోగినిపై దాడికి పాల్పడిన ఘటనపై సుమారు 83 సెకన్ల వీడియో ఓకటి వెలుగు చూసింది. ఈ వీడియోలో ఎంపి ప్రవర్తించిన తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

ఎయిరిండియా ఉద్యోగినిపై ఎంపి రవీంద్ర దాడి చేసే సమయంలో ఆమె మాత్రం తనపై దాడి చేయకూడదంటూ ఆమె ఎంపిని వేడుకున్నట్టు విన్పిస్తోంది. మీరు ఎంపి, ప్రజాస్వామ్య నాయకులు ఇలా చేయకూడదంటూ ఆమె వేడుకొన్న శబ్దాలు ఆ వీడియోలో కన్పిస్తున్నాయి.

మహిళా ఉద్యోగిపై దాడి చేసినందుకుగాను తనపై హత్యా నేరం కింద కేసుపెట్టాలని ఎంపి సవాల్ విసిరారు.తనపై అనేక కేసులున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

అయితే ఎయిరిండియా ఉద్యోగులపై తాను దాడి చేసినట్టుగా ఎంపి రవీంద్ర గైక్వాడ్ చెప్పారు.ఈ విషయమై తాను ప్రధానమంత్రి నరేంద్రమోడీతో మాట్లాడతానని చెప్పారు.తన పట్ల అమర్యాదగా ప్రవర్తించినందుకే తాను ఈ రకంగా వ్యవహరించాల్సి వచ్చిందని ఎంపి తాను చేసిన పనిని సమర్థించుకొన్నారు.

ఎయిరిండియా సిబ్బంది తన పట్ల అమర్యాదగా ప్రవర్తించిన విషయాన్ని ఆయన మీడియా ప్రతినిధులకు చెప్పారు.తాను బిజెపి ఎంపిని కాదు, శివసేన ఎంపిని అంటూ ఆయన చెప్పారు.

విమానంలో సీటింగ్ విషయమై ఎయిరిండియా సిబ్బందికి ఫిర్యాదుచేసినా వారి నుండి సరైన స్పందన రాలేదని చెప్పారు.తన పట్ల ఎయిరిండియా సిబ్బంది అమర్యాదగా వ్యవహరించిన తీరును పార్లమెంట్ లో ప్రస్తావించనున్నట్టు ఆయన చెప్పారు.

పూణె నుండి ఆయన న్యూఢిల్లీకి ప్రయాణిస్తున్న సమయంలో న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో మహిళా ఉద్యోగిపై ఎంపి శివసేన దాడికి పాల్పడ్డాడు.అయితే తనకు బిజినెస్ క్లాస్ టిక్కెట్టు ఉందని ఎంపి రవీంద్ర గైక్వాడ్ చెబుతోంటే, ఎంపికి ఎకానకీ క్లాస్ టిక్కెట్టు ఉందని ఎయిరిండియా ఉద్యోగులు చెబుతున్నారు.

ఈ ఘటనపై ఎయిరిండియా విచారణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మరో వైపు ఈ ఘటనను కేంద్ర విమానాయాశాఖ మంత్రి ఆశోక్ గజపతి రాజు విచారం వ్యక్తం చేశారు.రాజకీయనాయకులు ఎవరూ కూడ ఈ తరహ ఘటనలకు పాల్పడకూడదని ఆయన కోరారు.

English summary
Shiv Sena MP Ravindra Gaikwad, who hit an Air India staffer with his slipper at Delhi airport, on Thursday bragged about how he’d done it 25 times after refusing to get off Flight AI 852.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X