వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎదుటివారిని కొట్టండి, అవసరమైతే చంపేయండి: వైస్ ఛాన్స్‌లర్ వివాదాస్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఘాజీపూర్: వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్‌కు వైస్ ఛాన్స్‌లర్‌గా వ్యవహరిస్తున్న రాజారామ్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఘాజీపూర్‌లోని కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

యువత ఏం కావాలని కోరుకుంటారో అది సాధించి తీరతారని, జీవితంలో అనుకున్నది సాధించాలన్న తపన ఉన్నవారే పూర్వాంచల్‌‌ వర్సిటీ విద్యార్థులు అవుతారని, ఒకవేళ వర్సిటీ విద్యార్థులు ఎవరితోనైనా గొడవ పడితే దెబ్బలు తిని ఏడుస్తూ తన వద్దకు రావొద్దని, ఎదుటివారిని కొట్టండి.. అవసరమైతే చంపేయండని, ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటానని చెప్పారు.

 Murder them, beat them, well take care: Purvanchal University VC tells students

ఆయన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. పలు రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వస్తోంది. విద్యార్థులను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేసిన ఆయన్ను బాధ్యతల నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

దీనిపై కాంగ్రెస్ నేత శైలేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలతో ఆయన విద్యార్థులకు ఏం చెబుతామని అనుకుంటున్నారని మండిపడ్డారు. సమాజ్‌వాది పార్టీ అధికార ప్రతినిధి మనోజ్ రాయ్ మాట్లాడుతూ... ఇవి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలని, విద్యార్థులకు వైస్ ఛాన్సులర్లు మంచి చెప్పాలని, కానీ పూర్వాంచల్ యూనివర్సిటీ వీసీ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

English summary
The vice chancellor of Veer Bahadur Singh Purvanchal University, Jaunpur, has landed himself in a controversy by asking students to commit murder if they get into a fight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X