వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాబీయింగ్: రాష్ట్రపతి రేసులో మురళీ మనోహర్ జోషి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీ కాలం వచ్చే ఏడాదితో ముగియనుండటంతో ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు రాష్ట్రపతి అవుతారన్న అంశంపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఆ పదవి కోసం కొందరు బిజెపి సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి.

తాజాగా, రాష్ట్రపతి పదవి రేసులో మరో బిజెపి సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి పేరు కూడా చేరింది. ఇప్పటికే ఆయన ఈ పదవి కోసం ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి అగ్రనాయకులతో మంతనాలు జరుపుతున్నారని సమాచారం.

murali

జోషి ఈ విషయమై ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, పలువురు బిజెపి సీనియర్‌ నేతల్ని, సంఘ్‌ కీలక నేతల్ని కలిసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రపతి పదవి గురించి ఆయన వారితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సంఘ్‌ నిర్ణయం సైతం కీలక పాత్ర పోషించనుంది. వారి నిర్ణయం ప్రకారమే ప్రధాని మోడీ, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలు కలిసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేత దేవేంద్ర స్వరూప్‌.. జోషీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ నూతన ఛైర్మన్ రామ్ బహదూర్ రాయ్ కూడా జోషికి మద్దతు ప్రకటించారు.

English summary
Veteran BJP leader Murli Manohar Joshi has launched his bid to the Rashtrapati Bhavan, lobbying the RSS and the BJP leadership vigorously for the party's presidential nomination, insiders told India Today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X