వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెల్ఫీలు తీసుకుంటూ అలలకు కొట్టుకుపోయారు, 14మంది మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలోని మురుద్ - జంజీరా తీరంలో సోమవారం సముద్రంలో మునిగి 14 మంది విద్యార్థులు మృతి చెందిన విషాదకర జరిగింది. ఈ విషాధ ఘటనకు ఫోటోలు, సెల్ఫీలు కారణమని తెలుస్తోంది.

తమ స్నేహితులు సెల్ఫీలు తీసుకుంటుండగా ఒక్కసారిగా కెరటాలు ఎగసిపడటంతో కొట్టుకుపోయారని ప్రమాదం నుంచి బయటపడిన విద్యార్థిని తెలిపింది. పెద్ద కెరటాలు సముద్రంలోకి వారిని లాక్కుపోయాయని చెప్పింది. వీరిని రక్షించేందుకు పలువురు సముద్రంలోకి దూకారని చెప్పింది.

వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఎడ్ల బండ్లు, గుర్రపు బళ్లలో వారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పింది. దేవుడి దయతో తాను, తన స్నేహితురాలు ప్రాణాలతో బయటపడ్డామంది. తనను బతికించినందుకు దేవుడికి ధన్యవాదాలు అంది.

 Murud Tragedy: Students Were Taking Selfies When A Wave Drowned Them

ఆమె మాట్లాడుతూ... 'నేను చాలా అదృష్టవంతురాలిని ప్రమాదం నుంచి బయటపడి కలిగాను. ఇది చాలా విషాదకరమైన విహారయాత్ర. నన్ను నా స్నేహితులను రక్షించినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మేము బీచ్‌కు చేరుకున్నాము.

అందరం సరదాగా ఆడుకుంటున్నాం. అధ్యాపకులు వద్దని ఎంత వారించినప్పటికీ కొందరు స్నేహితులు సముద్రంలోకి దిగి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో పెద్ద అలలు రావడంతో ఆ తాకిడికి విద్యార్థులు అందరూ మునిగిపోయారు. వారిని కాపాడటానికి మరికొందరు ప్రయత్నించగా లాభం లేకపోయింద'ని చెప్పింది.

సోమవారం సాయంత్రం మురుది బీచ్‌లో విహారయాత్రకు వెళ్లిన 116 మంది విద్యార్థుల్లో 14 మంది విద్యార్థులు సముద్రంలో మునిగిపోయి మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఓబేద్‌ ఇనాందార్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.

English summary
Students Were Taking Selfies When A Wave Drowned Them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X