• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేశం మనదే .. దేహం మనదే .. ఎగురుతున్న జెండా మనదే ... మతాన్ని గెలిచిన అచన్

|

పుల్వామా : పుల్వామా దాడి తర్వాత సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైమానిక దాడులతో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇప్పటికీ కూడా సరిహద్దులో ఉత్కంఠ కొనసాగుతోంది. కానీ పుల్వామాలో ఆదిల్ అహ్మద్ ఆత్మాహుతి దాడిచేసిన ప్రాంతంలోనే ముస్లింలు మత సామరస్యాన్ని పాటిస్తున్నారు. శిథిలావస్థకు చేరిన శివాలయ నిర్మాణానికి చేయి చేయి కలిపి .. మనమంతా ఒక్కటే .. దేశం మనదే, దేహం మనదే .. మతం కాదు అని దేశభక్తిని చాటారు.

హిందూ-ముస్లిం భాయి .. భాయి ..

హిందూ-ముస్లిం భాయి .. భాయి ..

విభిన్న మతాలు, ఆచారాలు, సాంప్రదాయాలకు నెలవు భారతదేశం. ఇక్కడ హిందూ-ముస్లింల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. కానీ కశ్మీర్ లో అది కూడా పుల్వామాలో ఉగ్రవాదులు పేట్రెగిపోయిన జిల్లాలో ముస్లింలు చూపిన మత సామారస్యం మిగతావారికి ఆదర్శంగా నిలుస్తోంది. అచన్ గ్రామంలో 80 ఏళ్ల కిందట నిర్మించిన శివాలయం శిథిలావస్థకు చేరింది. దీంతో కశ్మీర్ పండిట్ ఉషా .. ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వానికి విన్నవించింది. చాన్నాళ్లు తిప్పుకున్న ప్రభుత్వం రూ.13 లక్షలు మంజూరుచేయడంతో అక్కడున్న ముస్లింలే గుడి నిర్మాణంలో పాలుపంచుకొని .. శెభాష్ అనిపించుకుంటున్నారు.

ముస్లింలే మెజార్టీ ... ఒకే కశ్మీర్ పండిట్ కుటుంబం

ముస్లింలే మెజార్టీ ... ఒకే కశ్మీర్ పండిట్ కుటుంబం

అచన్ ఓ కుగ్రామం. మారుమూల పల్లెటూరు .. మురికిగా, ఇరుకుగా ఉంటోంది. రోడ్లపై వెళ్తుటో పెంకుటిళ్లే ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. ఈ గ్రామంలో 2200 జనాభా ఉంటుంది. మెజార్టీ ప్రజలు ముస్లింలే. కేవలం 10 మంది సభ్యులున్న కశ్మీర్ పండిట్ కుటుంబం ఒక్కటే కొన్నేళ్లుగా ఇక్కడే ఉంటోంది. 1990లో చెలరేగిన హింసలో శివాలయం ధ్వంసమైంది. దీంతో కశ్మీర్ పండిట్లు లోయ నుంచి తరలిపోయారు. కానీ ఉషా శర్మ కుటుంబం మాత్రకే అక్కడ ఉంటూ .. శివుని సేవలో తరిస్తోంది. ఉషా కుటుంబం కోసం ముస్లింలు చేయి చేయి కలిపి .. పనులు చేస్తుండటం మిగతావారికి ఆదర్శంగా నిలుస్తోంది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోలింగ్ .. ఓటేయ్యద్దంటూ కాంగ్రెస్, టీడీపీ విప్ జారీ

గతేడాది అంకురార్పణ

గతేడాది అంకురార్పణ

శిథిలావస్థకు చేరిన శివాలయాన్ని పున:నిర్మించాలని ఉషా పండిట్ భావించారు. తనకు సాయం చేయాలని గ్రామస్థులను కోరారు. వారు సమావేశమై .. జిల్లా అధికారులకు విషయం తెలియజేసి పనుల కోసం సాయం చేయాలని కోరారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను కలిసి .. బాగు చేసేందుకు నిధులు ఇవ్వాలని పలు మార్లు కోరారు. చాన్నాళ్లకు రూ.13 లక్షల నిధులు మంజూరు చేశారు. గతనెలలో రూ.5 లక్షల నిధులు విడుదలవడంతో పనులు జోరందుకున్నాయి. ముస్లిం మేస్త్రీ ఆధ్వర్యంలో పనులు వేగంగా జరుగుతున్నాయి. పెయింటింగ్ కూడా జరుగుతోంది. ఇప్పటికే కాంపౌండ్ నిర్మాణం పూర్తయింది. తుది మెరుగులు దిద్దడంతో పనులు త్వరలోనే పూర్తవుతాయని ముస్లిం మేస్త్రీ పేర్కొన్నారు.

పొలిమేర దాటని ఉద్రిక్తత

పొలిమేర దాటని ఉద్రిక్తత

ఓ వైపు సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంటే .. ఆ సిచుయేషన్ అచన్ గ్రామ పొలిమేర దాటి రాలేదు. వారు ఎప్పటిలాగే జీవనం కొనసాగిస్తున్నారు. తమలో ఎలాంటి మార్పు రాలేదని చెప్తున్నారు. ఇక్కడున్న ఒక కశ్మీర్ పండిట్ కుటుంబం కూడా ఊరు విడిచి వెళితే గ్రామానికే సిగ్గుచేటని .. వారు సురక్షితంగా ఉండగలమనే నమ్మకంతో ఉన్నారని .. వారికి భరోసా కల్పించామని చెప్తున్నారు. అందుకోసం గుడి పునరుద్ధరణలో సాయపడుతున్నామని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు మా కుటుంబాన్ని మా వాళ్లుగా చూస్తున్నారని .. కశ్మీర్ పండిట్ ఉషా పేర్కొన్నారు. కొందరు కావాలనే ఇరువురి మధ్య ఉద్రిక్తలను సృష్టిస్తారని మండిపడ్డారామె.

English summary
After the Pulwama attack, there was a serious tension in the border. War clouds stormed air strikes. Still on the border continues to be the thrill. But in the Pulwama region, Adil Ahmad's mugs are the victims of the suicide attack. Marching to the Shiva temple building in ruins .. we all alone .That is the patriotism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more