వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబ్రీ తీర్పుపై అప్పీలుకు ముస్లిం సంఘాల నిర్ణయం-త్వరలో హైకోర్టులో పిటిషన్‌

|
Google Oneindia TeluguNews

28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత వ్యవహారంలో లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వాస్తవాలను విస్మరించేలా ఉందని ఆరోపిస్తున్న ముస్లిం సంఘాలు దీనిపై తదుపరి న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయి.

బాబ్రీ మసీదు కూల్చివేత..కేసు కొట్టివేత: ఏపీ బీజేపీ నేతలు ఏం చెబుతున్నారు? హిందుత్వ జాగృతంబాబ్రీ మసీదు కూల్చివేత..కేసు కొట్టివేత: ఏపీ బీజేపీ నేతలు ఏం చెబుతున్నారు? హిందుత్వ జాగృతం

1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు అద్వానీ, జోషీ, ఉమాభారతి సహా 32 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పుపై ముస్లిం సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది ఈ తీర్పులో సీబీఐ సరైన సాక్ష్యాధారాలు సమర్పించడంలో విఫలమైందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేయాలని నిర్ణయించాయి. తీర్పుపై స్పందించిన ముస్లిం పర్సనల్ లాబోర్డుతో పాటు బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కూడా ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించాయి. దీంతో ఈ వ్యవహారం తిరిగి అలహాబాద్‌ హైకోర్టుకు చేరబోతోంది.

muslim bodies to challenge cbi courts babri demolition case verdict

బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పులో తప్పులు ఉన్నాయని, వీటిని హైకోర్టులో సవాలు చేస్తామని బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కన్వీనర్ జఫర్యాబ్ జిలానీ ప్రకటించారు. ముస్లిం పర్సనల్‌ లాబోర్డు కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ముస్లిం పర్సనల్‌ లాబోర్డు తరఫున హైకోర్టులో దాఖలు చేసే పిటిషన్లో భాగస్వామి అవుతానని ఇప్పటికే ప్రకటించారు.

English summary
muslim law board and babri masjid action committee have decided to challenge cbi court's verdict on babri majid demotion case in high court soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X