వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్ళిలో పుస్తకాలను కట్నంగా ఇవ్వాలని కోరిన ముస్లిం వధువు .. వైరల్ న్యూస్

|
Google Oneindia TeluguNews

కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమని ప్రభుత్వాలు చెబుతున్నా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో కట్నాల రివాజు కొనసాగుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్ లోని ముస్లిం కుటుంబాలలో అమ్మాయికి వరుడి తరపున మెహర్ ఇవ్వటం ఆనవాయితీ .. అయితే ఒక ముస్లిం వధువు తనకు అరవై పుస్తకాలను మెహర్ గా ఇవ్వాలని కోరడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది.

పుస్తకాలను మెహర్ గా ఇవ్వాలని కోరిన వధువు

పుస్తకాలను మెహర్ గా ఇవ్వాలని కోరిన వధువు

పశ్చిమ బెంగాల్ లోని ముస్లిం కుటుంబాలలో వధువుకు మెహర్ ఇవ్వడం సంప్రదాయం కాగా, సాంప్రదాయ మెహర్ పై ఎలాంటి ఆసక్తి లేని ఓ వధువు తనకు కట్నంగా పుస్తకాలను ఇవ్వాలని కోరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముర్షిదాబాద్ సూటిలో నివసిస్తున్న, కల్యాణి విశ్వవిద్యాలయంలోని డిఎన్ కాలేజీకి చెందిన ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అయిన మోయినా ఖాతున్ (24) భాగల్పూర్ విశ్వవిద్యాలయం నుండి జాగ్రఫీ గ్రాడ్యుయేట్ అయిన మిజానూర్ రెహ్మాన్ (24) ను వివాహం చేసుకున్నారు .

కుమార్తె కోరిక చూసి షాక్ అయిన తల్లిదండ్రులు , సరేనన్న వరుడి కుటుంబం

కుమార్తె కోరిక చూసి షాక్ అయిన తల్లిదండ్రులు , సరేనన్న వరుడి కుటుంబం

ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అయినప్పటికీ, సదరు వధువు సాంప్రదాయ మెహర్‌కు బదులుగా పుస్తకాలను డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మోయినా ముందే తన తల్లిదండ్రులకు స్పష్టం చేసింది.మొదట్లో ఆమె తల్లిదండ్రుల అభ్యర్థనను చూసి షాక్‌కు గురైనప్పటికీ, కుమార్తెకు పుస్తకాల పై ఉన్న ఆసక్తి నేపథ్యంలో అంగీకరించారు. ఇక వరుడి కుటుంబం ఈ డిమాండ్‌ను సంతోషంగా అంగీకరించింది.

మిజానూర్ కుటుంబం మొయినా డిమాండ్‌ను అంగీకరించడమే కాక, ఆమె డిమాండ్‌కు అదనంగా మరిన్ని పుస్తకాలను కూడా ఇచ్చింది.

బెంగాలీ ప్రముఖ రచయితల పుస్తకాల కార్టన్ లను బహుమతిగా ఇచ్చిన వరుడి కుటుంబం

బెంగాలీ ప్రముఖ రచయితల పుస్తకాల కార్టన్ లను బహుమతిగా ఇచ్చిన వరుడి కుటుంబం

మొయినా యొక్క స్వస్థలమైన కిడర్‌పూర్ గ్రామవాసులు కట్నం కింద వరుడి కుటుంబం బెంగాలీలోని ఖురాన్, రవీంద్రనాథ్ ఠాగూర్, నజ్రుల్ ఇస్లాం మరియు బిభూతిభూషణ్ బంధోపాధ్యాయల రచనలను, పుస్తకాలతో నిండిన కార్టన్‌లను తీసుకెళ్లడంతో ఆశ్చర్యపోయారు. వరుడి కుటుంబ సభ్యులు మోయినా యొక్క వింత అభ్యర్థనతో ఆశ్చర్యానికి లోనైనా, ఆమె కోరికను మన్నించి పుస్తకాలను మెహర్ గా ఇచ్చారు. అంతేకాదు ఆమెకు కొంత నగదు కూడా ఖర్చుల కోసం ఆమె కోరనప్పటికీ ఇచ్చారు .

చిన్నప్పటి నుండే పుస్తకాలే ఇష్టం .. గతంలో కేరళ వధువును చూసి ప్రేరణ పొందానన్న వధువు

చిన్నప్పటి నుండే పుస్తకాలే ఇష్టం .. గతంలో కేరళ వధువును చూసి ప్రేరణ పొందానన్న వధువు

ఇక పుస్తకాలను కట్నంగా ఇవ్వాలని కోరిన మొయినా తన చిన్నతనం నుండి తాను ఎప్పుడూ పుస్తకాల పురుగుగానే ఉన్నానన్నారు . కొన్ని సంవత్సరాల క్రితం కేరళ వధువు నుండి ఇదే విధమైన అభ్యర్థన గురించి చదివానని, అప్పుడే తనకు కూడా ఈ ఆలోచన వచ్చిందని పేర్కొంది. తాను ఈ విధంగా పెళ్లి చేసుకుంటానని తనకు తెలుసని ఆమె చెప్పింది

English summary
A bride in West Bengal has set an example after demanding 60 books as mehr, the dowry that a groom needs to pay, from her would-be in-laws. Moyna Khatun, 24, a resident of Murshidabad's Suti got married to Mizanur Rahman, 24.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X